Rashmika Mandanna: తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో రష్మిక.. రీల్ కాదు రియల్!

నేషనల్ క్రష్ రష్మిక మందన ప్రస్తుతం ఎలాంటి క్రేజ్‌తో దూసుకెళ్తుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే రష్మిక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఆమె తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నట్లుగా రష్మిక తెలిపింది.

Rashmika Mandanna: తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో రష్మిక.. రీల్ కాదు రియల్!

Rashmika Mandanna About Her Poverty In Childhood

Updated On : November 18, 2022 / 7:37 PM IST

Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన ప్రస్తుతం ఎలాంటి క్రేజ్‌తో దూసుకెళ్తుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కన్నడలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి, అటుపై టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా ఎదిగింది ఈ బ్యూటీ. ఇక ప్రస్తుతం బాలీవుడ్‌లోనూ అమ్మడు వరుస సినిమాలతో దుమ్ములేపుతోంది.

Rashmika Mandanna: సంవత్సరాలు గడుస్తున్నా కొన్ని విషయాలు నన్ను ఇంకా బాధ పెడుతూనే ఉన్నాయి.. ఎమోషనల్ అయిన రష్మిక!

అయితే రష్మిక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఆమె తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నట్లుగా రష్మిక తెలిపింది. తన చిన్నతనంలో స్కూల్ డేస్‌లో ఆర్థికంగా తన కుటుంబం చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నట్లుగా రష్మిక తెలిపింది. తన తండ్రి తనకు బొమ్మలు కొనిచ్చే స్థాయిలో కూడా లేడని ఆమె బాధపడేదట. ఇక ఇంటి అద్దె కట్టేందుకు కూడా ఒక్కోసారి డబ్బులు లేకపోవడంతో, తరుచూ ఇళ్లు మారేవారట. తన తండ్రికి ఆదాయం లేకపోవడంతో తమ కుటుంబం చాలా కష్టాలను చవిచూశామని రష్మిక తెలిపింది.

Rashmika Mandanna : స్పెషల్ యాడ్ షూట్ కోసం దుబాయ్ ఎడారిలో రెచ్చిపోయి ఫోజులిచ్చిన రష్మిక

అందుకే తనకు ప్రతి రూపాయి విలువ తెలుసని, అందుకే డబ్బును వృథా చేయకుండా ఆదా చేసేవాళ్లంటే తనకు నచ్చుతారని రష్మిక పేర్కొంది. ఇక ప్రస్తుతం రష్మిక పుష్ప-2, వారిసు సినిమాలతో పాటు బాలీవుడ్‌లో పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుల్లో నటిస్తూ బిజీగా మారింది. ఏదేమైనా రష్మిక ఆర్థిక ఇబ్బందుల గురించి తెలుసుకుని, ఆమె అభిమానులు ఆమె పడ్డ కష్టానికి తగ్గ ఫలితం దక్కిందని అంటున్నారు.