Bigg Boss 5 : నేను వెళ్తేనే నువ్వు గెలుస్తావు.. షణ్ను కోసం రవి త్యాగం?
షణ్ను పాస్ అని చెప్పడంతో అతడు లేచి ఏదైనా బాధపెట్టి ఉంటే క్షమించమని కోరుతూ ఏడ్చేశాడు. షణ్ను ఏడవడం ఆపకపోవడంతో రవి.. నేను వెళ్తేనే నువ్వు గెలుస్తావంటూ షణ్నుతో......
Bigg Boss 5 : నిన్న వీకెండ్ ఎపిసోడ్ కావడంతో ఓ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారు. వచ్చిన ఓటింగ్స్ ప్రకారం అందరూ సేఫ్ అయి చివరికి రవి, కాజల్ మాత్రమే నామినేషన్స్‌లో మిగిలారు అని చెప్పాడు బిగ్ బాస్. అయితే సన్నీకి ఉన్న ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను నువ్వు వాడుకుంటావా? లేదా వీళ్లలో ఒకరిని సేవ్ చేయడానికి వాడతావా? అని ప్రశ్నించాడు నాగార్జున. దీంతో సన్నీ తన ఫ్రెండ్ కాజల్‌ను సేవ్ చేయడానికి వాడాడు. కానీ ఓటింగ్‌లో రవి చివరి స్థానంలో ఉన్నాడని చెప్పి బిగ్ బాస్ రవిని ఎలిమినేట్ చేసాడు.
Bigg Boss 5 : బిగ్ బాస్ విజేతకు అదిరిపోయే ఆఫర్.. ప్రైజ్‌మనీతో పాటు ఇల్లు కట్టుకోడానికి స్థలం కూడా..
రవి ఎలిమినేట్ అవ్వడంతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వడం ఏంటి అని అందరూ షాక్ అయ్యారు. సన్నీ నిన్ను సేవ్ చేయనందుకు సారి అని తన దగ్గరున్న గిఫ్ట్ వోచర్‌ను అతడికి బహుమతిగా ఇచ్చాడు. అందరూ రవికి కన్నీటితో వీడ్కోలు పలికారు. స్టేజీ మీదకు వచ్చిన రవి చాలా తొందరగా బయటకు వచ్చేశానని బాధపడ్డాడు. అనంతరం ఈ బిగ్‌బాస్ జర్నీలో ఎవరు పాస్, ఎవరు ఫెయిల్ చెప్పమంటూ నాగార్జున రవిని అడిగాడు.
లేట్‌గా కనెక్ట్ అయిన శ్రీరామ్ లో అన్నీ పాజిటివ్సే ఉన్నాయి. నువ్వు లోపలి నుంచి ఆడు, నేను బయట నుంచి ఆడతానని చెప్తూ అతడిని పాస్ చేశాడు.
ఫ్రెండ్ కోసం ఏదైనా చేస్తాడు, తోపు అంటూ సన్నీని పాస్ చేశాడు.
ప్రియాంక, సిరి, కాజల్‌లు ఫెయిల్ అని చెప్పాడు. టాప్ 5లోకి రావాలని సిరితో చెప్పాడు.
మానస్‌ను చూసి చాలా ఇన్స్పైర్ అయ్యానని చెప్తూనే అతడికి ఫెయిల్ ట్యాగ్ ఇచ్చాడు.
షణ్ను పాస్ అని చెప్పడంతో అతడు లేచి ఏదైనా బాధపెట్టి ఉంటే క్షమించమని కోరుతూ ఏడ్చేశాడు. షణ్ను ఏడవడం ఆపకపోవడంతో రవి.. నేను వెళ్తేనే నువ్వు గెలుస్తావంటూ షణ్నుతో చెప్పాడు.
Shivashankar Master : శివశంకర్ మాస్టర్ గురించి మీకు తెలియని విషయాలు..
అయితే ఈ మాటలపై ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా చర్చ జరుగుతుంది. యాంకర్ రవి టాప్ 5లో కాదు ఏకంగా టాప్ 3లోనే ఉంటాడు అనుకున్నారు ప్రేక్షకులు. ప్రతి వారం రవి నామినేషన్ లో ఉన్నా అందరి కంటే ఎక్కువ ఓట్లు పడి సేవ్ అవుతూ వచ్చాడు. కాని ఈ వారం ఎలిమినేట్ చెయ్యడంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. రవి ఎలిమినేషన్ ని తప్పు పడుతూ రవి అభిమానులు బిగ్ బాస్ సెట్ బయట నిన్న అర్ధరాత్రి ధర్నా కూడా చేశారు. ఇది అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ బిగ్‌బాస్‌ను తిడుతూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. కాజల్, సిరి, ప్రియాంక కంటే రవికే తక్కువ ఓట్లు వచ్చాయంటే ఎవ్వరూ నమ్మరు అని అంటున్నారు. ఇక రవి ఈ మాట అనడంతో బిగ్ బాస్ స్క్రిప్టెడ్ షో అని మరోసారి అర్ధమవుతుందంటూ కామెంట్లు పెడుతున్నారు. షణ్నుని విన్నర్ చేయడానికే రవికి ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చి ఎలిమినేట్ చేశారా అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రేక్షకులు.