Raviteja Next Movie: మరోసారి ఆ డైరెక్టర్‌తో చేతులు కలుపుతున్న రవితేజ.. ఎవరంటే?

మాస్ రాజా రవితేజ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఆయన నటించిన ధమాకా చిత్రం రిలీజ్‌కు రెడీగా ఉండగా, టైగర్ నాగేశ్వర్ రావు, రావణాసుర ఇంకా చిత్రీకకరణ దశలోనే ఉన్నాయి. ఈ సినిమాలు రిలీజ్ కాకముందే తన నెక్ట్స్ ప్రాజెక్టుల విషయంలోనూ తనదైన మార్క్ చూపిస్తూ వెళ్తున్నాడు.

Raviteja Next Movie: మరోసారి ఆ డైరెక్టర్‌తో చేతులు కలుపుతున్న రవితేజ.. ఎవరంటే?

Raviteja Next Movie With Sampath Nandi

Updated On : September 12, 2022 / 5:05 PM IST

Raviteja Next Movie: మాస్ రాజా రవితేజ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఆయన నటించిన ధమాకా చిత్రం రిలీజ్‌కు రెడీగా ఉండగా, టైగర్ నాగేశ్వర్ రావు, రావణాసుర ఇంకా చిత్రీకకరణ దశలోనే ఉన్నాయి. ఈ సినిమాలను వరుసగా రిలీజ్ చేసేందుకు రవితేజ్ పక్కా ప్లానింగ్‌తో దుసుకెళ్తున్నాడు. కాగా, ఈ సినిమాలు రిలీజ్ కాకముందే తన నెక్ట్స్ ప్రాజెక్టుల విషయంలోనూ తనదైన మార్క్ చూపిస్తూ వెళ్తున్నాడు.

Raviteja Next Movie Titled Eagle: మరో క్రేజీ ప్రాజెక్టుకు మాస్ రాజా రెడీ.. టైటిల్ కూడా క్రేజీయే!

ఇప్పటికే తన నెక్ట్స్ ప్రాజెక్టును దర్శకుడు శ్రీను వైట్ల లేదా కార్తీక్ ఘట్టమనేనితో తెరకెక్కిస్తాడనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తూ వచ్చింది. అయితే రవితేజ ఇప్పుడు ఈ ఇద్దరినీ కాదని, మరో దర్శకుడితో సినిమా చేసేందుకు ఆసక్తిని చూపుతున్నట్లుగా తెలుస్తోంది. గతంలో ‘బెంగాల్ టైగర్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని తనకు అందించిన దర్శకుడు సంపత్ నందితో కలిసి మరోసారి సినిమా చేసేందుకు మాస్ రాజా రెడీ అవుతున్నాడట. ఇప్పటికే సంపత్ నంది రవితేజను కలిసి ఓ కథను నెరేట్ చేయగా, అది బాగా నచ్చిన మాస్ రాజా త్వరలోనే ఈ సినిమాను అఫీషియల్‍‌గా అనౌన్స్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

Raviteja : రవితేజకి ఏమైంది..? ఎందుకీ వరుస ఫ్లాపులు..?

ఇలా తాను ముందుగా అనుకున్న డైరెక్టర్స్‌తో కాకుండా మరోసారి తనకు బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడితో చేతులు కలుపుతుండటం ప్రస్తుతం హాట్ టాపి‌క్‌గా మారింది. అయితే ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ వీరిద్దరి కాంబినేషన్ మరోసారి సెట్ అయితే మాత్రం అభిమానులకు మరోసారి అదిరిపోయే ట్రీట్ ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.