Regina Cassandra: అందర్నీ ఇలాంటి ప్రశ్నలే అడుగుతారా అంటూ.. ప్రెస్‌మీట్ లో రిపోర్టర్స్ మీద ఫైర్ అయిన రెజీనా..
ప్రెస్ మీట్ లో హీరోయిన్ రెజీనా విలేఖరుల ప్రవర్తనతో అసహనంగా ఫీల్ అయింది. ఓ రిపోర్టర్ పై ఫైర్ అయింది కూడా. ప్రెస్ మీట్ లో భాగంగా ఓ రిపోర్టర్.. మేడమ్ మీకు ఈ సినిమాలో ఓసీడీ ఉన్నట్లు చూపించారు, నిజ జీవితంలో కూడా మీకు..........

Regina Cassandraa fires on reporters in saakini daakini pressmeet
Regina Cassandra: రెజీనా, నివేదా థామస్ మెయిన్ లీడ్స్ గా కొరియన్ సినిమా మిడ్నైట్ రన్నర్స్ సినిమాకి కి రీమేక్ గా తెరకెక్కుతున్న సినిమా ‘శాకిని డాకిని’. సుధీర్ వర్మ ఈ సినిమాని తెరకెక్కించగా సునీత తాటి నిర్మించింది. సురేష్‌బాబు ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. శాకిని డాకిని సెప్టెంబర్ 16న విడుదల కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా మంగళవారం సాయంత్రం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.
అయితే ప్రెస్ మీట్ లో హీరోయిన్ రెజీనా విలేఖరుల ప్రవర్తనతో అసహనంగా ఫీల్ అయింది. ఓ రిపోర్టర్ పై ఫైర్ అయింది కూడా. ప్రెస్ మీట్ లో భాగంగా ఓ రిపోర్టర్.. మేడమ్ మీకు ఈ సినిమాలో ఓసీడీ ఉన్నట్లు చూపించారు, నిజ జీవితంలో కూడా మీకు ఓసీడీ ఉందా అని అడిగాడు. దీంతో ఈ ప్రశ్నకి రెజీనా కోపం తెచ్చుకొని సమాధానమిస్తూ.. మీరు అందర్నీ ఇలాగే ప్రశ్నిస్తారా? సినిమాలో మేము కేవలం నటిస్తామంతే. పాత్ర డిమాండ్ చేయడం వల్ల మేము అలా నటిస్తాము. అమ్మాయిల్ని చాలా గొప్పగా చూపిస్తూ ఈ సినిమాని తీస్తే మీరేమో నా పాత్ర, ఓసీడీ గురించి అడుగుతున్నారు. వ్యక్తిగతంగా నేను శుభ్రంగా ఉండటానికి చూస్తాను, అంతేకాని ఓసీడీ లాంటి సైకలాజికల్ డిజార్డర్ నాకేమీ లేదు. మీ వద్ద ఇలాంటి ప్రశ్నలే ఉంటాయా” అంటూ ఫైర్ అయింది.
Saakini Daakini : శాకిని డాకిని ప్రమోషన్స్ లో నివేదా, రెజీనా..
ఇక ఆ ఆతర్వాత ప్రెస్మీట్లో విలేకర్ల ఫోన్లు వరుసగా రింగ్ అవ్వడంతో రెజీనా అసహనానికి గురయి.. ప్రెస్మీట్లో పాల్గొనేటప్పుడు మీరందరూ ఫోన్లు సైలెంట్లో పెట్టుకోరా? అంటూ ప్రశ్నించింది. దీంతో రెజినా ఫైర్ అయి మాట్లాడిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.