Renu Desai : పవన్ కల్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన రేణు దేశాయ్

నటి రేణు దేశాయ్ తన మాజీ భర్త పవన్ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసారు. పొలిటికల్‌గా పవన్ కల్యాణ్‌ను సమర్ధించినందుకు ఎదురైన ట్రోల్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Renu Desai : పవన్ కల్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన రేణు దేశాయ్

Renu Desai

Renu Desai : రేణు దేశాయ్ తన మాజీ భర్త పవన్ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసారు. పొలిటికల్‌గా పవన్ కల్యాణ్‌ను సపోర్ట్ చేసినందుకు ఎదురైన ట్రోల్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పవన్ తనకు అన్యాయం చేసిన మాట వాస్తవమని..దానిని తను పక్కన పెట్టి ఆయనకు ఒక్క ఛాన్స్ ఇస్తే ప్రజలకు మంచి చేస్తారేమో అని సపోర్ట్‌గా మాట్లాడానన్నారు రేణు దేశాయ్.

Renu Desai : హైదరాబాద్, పూణేలో రేణుదేశాయ్‌కి ఆస్తులు.. ఆమెకు సంపాదన ఎలా వస్తుంది..?

రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. చాలా గ్యాప్ తర్వాత ఇటీవలే ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల్ని తన నటనతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన ప్రమోషన్లలో తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికరమైన విషయాలు షేర్ చేసుకున్న రేణు తాజాగా తన మాజీ భర్త పవన్ కల్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. తన విషయంలో పవన్ తీరని అన్యాయం చేసిన మాట వాస్తవమే అయినా .. ప్రజలకు పవన్ మంచి చేస్తారేమో అనే కోణంలో తనని సపోర్ట్ చేస్తు పోస్ట్ పెట్టానన్నారు రేణు దేశాయ్. ప్రతి ఒక్కరి జీవితంలో చీకటి కోణం ఉంటుందని తన వ్యక్తిగత జీవితం పక్కన పెడితే పవన్‌కి ఒక్క ఛాన్స్ ఇస్తే మంచి చేయవచ్చేమో అని తాను భావించానని అన్నారు.

Renu Desai : రేణు దేశాయ్ ‘మయోకార్డియల్ బ్రిడ్జింగ్’ సమస్యతో బాధపడుతోందా? ఇది ప్రమాదకరమా?

10 సంవత్సరాల పవన్ కల్యాణ్ పొలిటికల్ జర్నీని గమనించిన ఓ సాధారణమైన సిటిజన్‌లా తనకు మాట్లాడే హక్కు ఉందన్నారు రేణు దేశాయ్. పవన్‌కి డబ్బు పిచ్చి లేదని.. డబ్బే కావాలనుకుంటే ప్యాన్ ఇండియా రేంజ్‌లో సినిమాలు చేసుకోవచ్చని అన్నారు. అకీరా సినిమా ఎంట్రీకి పవన్ సపోర్ట్ కోసమే తను పవన్ గురించి మాట్లాడుతున్నానని కూడా ట్రోల్ చేసారని చెప్పుకొచ్చారు రేణు. అకీరాకు పవన్ తండ్రి అని .. ఛాన్స్‌ల కోసం  తను పవన్ మద్దతు అడగనవసరం లేదని స్పష్టం చేసారు. పవన్ తనకి చేసిన అన్యాయం పక్కన పెట్టి మరీ మాట్లాడినందుకు కొందరు తనను వక్రీకరించి ట్రోల్ చేసారని రేణు ఆవేదన వ్యక్తం చేసారు.