Chay-Sam Breakup : వర్కౌట్ కానప్పుడు విడిపోవడమే బెటర్.. చై-సామ్ విడాకులపై స్పందించిన డైరెక్టర్

వీళ్ళ విడాకులపై ఒక్కొక్కరు ఒక్కో రీతిలో స్పందిస్తున్నారు. సెలబ్రిటీలు కూడా కొంతమంది వీరి విడాకులపై స్పందిస్తున్నారు. తాజాగా 'రిపబ్లిక్' సినిమా డైరెక్టర్ దేవాకట్టా వీరి విడాకులపై

Chay-Sam Breakup : వర్కౌట్ కానప్పుడు విడిపోవడమే బెటర్.. చై-సామ్ విడాకులపై స్పందించిన డైరెక్టర్

Sam Chai

Chay-Sam Breakup :  సమంత, నాగ చైతన్యలు ఇటీవల విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఈ టాపిక్ ట్రేండింగ్ లోనే ఉంది. చాలా మంది అభిమానులు వారు కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. టాలీవుడ్ లో ప్రస్తుతం బ్యూటుఫుల్ కపుల్ గా ఉండే వీళ్ళు అసలు ఎలా విడిపోయారు అని ఎవ్వరికి అర్ధం కావట్లేదు. వీరి విడాకులకు కారణాలను ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారు. మీడియాలో, సోషల్ మీడియాలో వీళ్ళ విడాకులపై ఒక్కొక్కరు ఒక్కో రీతిలో స్పందిస్తున్నారు. సెలబ్రిటీలు కూడా కొంతమంది వీరి విడాకులపై స్పందిస్తున్నారు. తాజాగా ‘రిపబ్లిక్’ సినిమా డైరెక్టర్ దేవాకట్టా వీరి విడాకులపై స్పందించారు.

ఇటీవల రిలీజ్ అయి మంచి విజయం సాధించింది ‘రిపబ్లిక్’ సినిమా. ఈ సినిమాకి సంబంధించి ఇచ్చిన ఇంటర్వ్యూలలో చై – సామ్ విడాకుల గురించి అడగడంతో దేవాకట్టా స్పందించాడు. దేవాకట్టా డైరెక్షన్ లో అంతకు ముందు నాగచైతన్య, సమంతలు హీరో హీరోయిన్స్ గా ఆటోనగర్ సూర్య సినిమా చేశారు. అప్పటికి వారికింకా పెళ్లి కాలేదు. ఈ విషయాలపై కూడా దేవాకట్టా మాట్లాడారు.

Kangana Ranut : ఆర్య‌న్‏కు హృతిక్ రోష‌న్ మ‌ద్ద‌తు..కంగ‌నా ఫైర్..

చై-సామ్ ల గురించి దేవాకట్టా మాట్లాడుతూ.. ‘ఆటోనగర్ సూర్య’ సినిమా సమయంలో ఇద్దరూ కూడా మంచి స్నేహితులు అని, ఆ సమయంలో చాలా మెచ్యూర్డ్ గా ఆలోచించే వారు అని, ఇద్దరు కూడా చాలా క్లోజ్ గా ఉండటం, ప్రతి విషయంలో కూడా చర్చించుకుంటూ ఉండటం నేను అప్పట్లో గమనించాను అని అన్నారు. సెట్స్ లో ఉన్న సమయంలో వారిద్దరు కూడా చాలా ప్రొఫెషనల్ గా ఉండే వారు అందుకే నాకు వారు ప్రేమలో పడ్డారనే విషయం తెలియదు, అప్పట్లో వారు ప్రేమలో ఉన్న విషయంను నేను గమనించలేదని, ఆ విషయం గురించి కూడా నేను ఎప్పుడూ మాట్లాడలేదని చెప్పారు.

ఇక విడాకుల గురించి మాట్లాడుతూ.. పెళ్లి బంధం వర్కౌట్ కానప్పుడు, కలిసి జీవితాన్ని పంచుకోలేనప్పుడు విడిపోవడం చాలా మంచి నిర్ణయం. సమాజం కోసం ఇద్దరు కలిసి ఉండి జీవితాన్ని నరకం చేసుకోవడం కరెక్ట్ కాదు అని అన్నారు దేవాకట్టా. వారిద్దరు భార్య భర్తలు కాకముందు మంచి స్నేహితులు. ఇద్దరూ కూడా మంచి వ్యక్తులు కనుక వారు మంచి స్నేహితులుగా విడిపోయి సంతోషంగా ఉంటారని అనుకుంటున్నాను. నాకు చైతూ చాలా క్లోజ్. కుదిరితే ఒక మంచి లవ్ స్టోరీ చైతూతో తీయాలని అనుకుంటున్నాను అని దేవాకట్టా తెలిపారు.