Unstoppable with NBK : బాలయ్యని ఒక్క ఛాన్స్ అడిగిన వర్మ

తాజాగా ఈ షోపై సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ''బాలయ్య బాబు హోస్ట్ చేస్తున్న ఈ షో నాకు చాలా ఇష్టం. ఈ షో ఆకాశాన్నంటింది. నేను ఈ షోలో పాల్గొనాలి అనుకుంటున్నాను..

Unstoppable with NBK :  బాలయ్యని ఒక్క ఛాన్స్ అడిగిన వర్మ

Rgv

RGV :  ప్రస్తుతం బాలయ్య బాబు మంచి జోష్ లో ఉన్నాడు. అఖండ సినిమా భారీ విజయం సాధించడం, మరో పక్క ఆహా ఓటీటీలో వస్తున్న ‘అన్ స్టాపబుల్ విత్ NBK’కి విశేష స్పందన రావడంతో బాలకృష్ణ మంచి ఫామ్ లో ఉన్నారు. బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ లో సెలబ్రిటీలని తీసుకొచ్చి వారితో ఎంటర్టైన్ చేస్తున్నారు. ఈ షో ఇప్పటికే రికార్డ్స్ ని సృష్టించింది. ఇప్పటివరకు ఈ షోలో మంచు ఫ్యామిలీ, నాని, బ్రహ్మానందం, అనిల్ రావిపూడి, పుష్ప టీం, అఖండ టీం, రానా, రాజమౌళి, రవితేజ, లైగర్ టీం వచ్చారు. త్వరలో 10వ ఎపిసోడ్ కి మహేష్ బాబు రాబోతున్నారని కూడా ప్రకటించారు. ఈ షో జనాల్లో బాగా క్రేజ్ ని తెచ్చుకుంది.

Dhanush-Aishwarya : 21 ఏళ్లకే ధనుష్‌కి పెళ్లి.. ఐశ్వర్య‌కి ఎంత ఏజ్ తెలుసా??

తాజాగా ఈ షోపై సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ”బాలయ్య బాబు హోస్ట్ చేస్తున్న ఈ షో నాకు చాలా ఇష్టం. ఈ షో ఆకాశాన్నంటింది. నేను ఈ షోలో పాల్గొనాలి అనుకుంటున్నాను. బాలయ్య గారు నన్ను కూడా ఈ షోకి పిలుస్తారు, నాకు ఒక ఛాన్స్ ఇస్తారు అనుకుంటున్నాను” అని ట్వీట్ చేశారు ఆర్జీవీ. అయితే ఈ ట్వీట్ ని కొంతసేపటి తర్వాత డిలీట్ చేశారు.