RGV: అమ్మాయిలంటే ఇష్టం.. లెస్బియన్స్ అమ్మాయిలంటే ఇంకా ఇష్టం!

ప్రపంచంలో ఏం జరిగినా తనకు కావాలి.. తెలుగు రాష్ట్రాలలో ఏ అంశంపై ఎవరు మాట్లాడినా దానికి ఆయన ఏమనుకుంటున్నాడో చెప్పే వరకు ఆయనకు మనసు ఆగదు. అలా చెప్తే ఎవరు ఏమనుకుంటారో తనకు అనవసరం.

RGV: అమ్మాయిలంటే ఇష్టం.. లెస్బియన్స్ అమ్మాయిలంటే ఇంకా ఇష్టం!

Rgv

RGV: ప్రపంచంలో ఏం జరిగినా తనకు కావాలి.. తెలుగు రాష్ట్రాలలో ఏ అంశంపై ఎవరు మాట్లాడినా దానికి ఆయన ఏమనుకుంటున్నాడో చెప్పే వరకు ఆయనకు మనసు ఆగదు. అలా చెప్తే ఎవరు ఏమనుకుంటారో తనకు అనవసరం. ఇలా ప్రతి దానిలో ఇన్వాల్వ్ అయితే అసలు ఈ ప్రపంచం తన గురించి ఏమనుకుంటుందో కూడా నాకు అనవసరం అంటాడు. నిజానికి పక్కోడు ఎదురింటోడు ఏమనుకుంటాడో అని అనుకోవాళ్లే ఈ భూమ్మీద ఎక్కువ. కానీ.. చాలా తక్కువ మంది మాత్రమే ఎవరు ఏమనుకుంటే నాకెందుకు అంటారు.. అలాంటి వారిలో మనకి దగ్గరి మనిషి రామ్ గోపాల్ వర్మ.

Jr NTR: తారక్ కోసం బాలీవుడ్ దర్శకుడి చర్చలు.. సెట్టవుతుందా?

కొందరు ఆర్జీవీని వింత జీవి అనుకున్నా.. కాదు పక్కా బ్రతక నేర్చిన మనిషని చెప్పుకున్నా.. మరికొందరు ఇవన్నీ కాదు ఆయనో మూర్ఖుడు అన్నా.. అనుకుంటే అనుకోండి అది మీ ఫీలింగ్.. నా ఫీలింగ్ నేను చెప్తా అంటూ సమాధానం చెప్పడం కూడా వర్మకే చెల్లుతుంది. కరోనా తర్వాత ఆర్జీవీ కంపెనీ నుంచి నెలకి రెండో, మూడో సినిమాలు వస్తున్నాయి, వెళ్తున్నాయి. ఓటిటిలకు తోడు ఆయనకి ఆయన ఏర్పరుచుకున్న డిజిటల్ లో ఈ సినిమాలు వస్తుంటాయి. అలా రాబోతుందే డేంజరస్.. ఇద్దరి లెస్బియన్స్ అమ్మాయిల కథే ఇది.

Ritu Varma: నీలి రంగు చీరలోన.. సందమామ నీవె జాణ!

డేంజరస్ తో పాటు కొండా అనే మరో కల్పితాలతో కూడిన మరో బయోపిక్ కూడా తెరకెక్కించేందుకు సిద్దమయ్యాడు. డేంజరస్ ఎప్పుడో షూటింగ్ కూడా పూర్తికాగా త్వరలోనే విడుదలకి సిద్దమవుతుంది. ఈ రెండు సినిమాలు.. ఈ మధ్యనే తీవ్ర వివాదాస్పదంగా మారిన మా ఎన్నికలు, తాజాగా రాజకీయ పరిణామాలపై వర్మ తనదైన శైలిలో విశ్లేషణ సాగించారు. 10 టీవీ క్వశన్ అవర్ ఈ వర్మ మార్క్ విశ్లేషణకు వేదికైంది.

Chiranjeevi: భోళా శంకర్ మళ్ళీ వెనక్కి.. మెహర్ అసలు మ్యాటరేంటి?

తనకి ఈ సృష్టిలో ఇష్టమైంది కేవలం అమ్మాయిలు మాత్రమేనని చెప్పే వర్మ ఇప్పుడు ఈసారి లెస్బియన్స్ అమ్మాయిలంటే మరీ ఇష్టం అంటున్నాడు. తన డేంజరస్ సినిమాపై మాట్లాడిన వర్మ.. ఒక్క అమ్మాయి ఉంటే బ్యూటీ.. అదే ఇద్దరు అమ్మాయిలంటే డబుల్ బ్యూటీ అందుకే ఈ సినిమా చేశానని చెప్పాడు. లెస్బియన్స్ అంటే ఎవరికి ఏ అభిప్రాయమున్నా.. తనకు మాత్రం వాళ్ళ ఫీలింగ్స్ లో చూస్తే చాలా ఇష్టమన్నారు. అలా అని.. ఇద్దరు లెస్బియన్ మగాళ్ల మీద సినిమా చూసే ధైర్యం నాకు లేదని.. అది నాకు నచ్చదన్నారు. ఎందుకంటే అమ్మాయిలంటేనే తనకు ఇష్టమన్నారు.