వాళ్లు ఓకే అంటే నేను రెడీ!..

  • Published By: sekhar ,Published On : August 23, 2020 / 03:50 PM IST
వాళ్లు ఓకే అంటే నేను రెడీ!..

Roja re entry: రోజా.. ఒక‌ప్పుడు తెలుగు, తమిళ్‌లో అగ్ర క‌థానాయ‌కులంద‌రితో ఆడిపాడారు. త‌ర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఎమ్మెల్యేగా బిజీ అయ్యారు. న‌టిగా సెకండ్ ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేసి ‘గోలీమార్’, ‘కోడిపుంజు’ వంటి సినిమాలు చేశారు. ఆ సినిమాలు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. అయితే ఆమె వెండితెర‌కు దూర‌మై చాలా కాల‌మైంది. రోజాను సినిమాల్లో న‌టింప చేయాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్రయత్నించినప్పటికీ రాజకీయాలు, టీవీ షోలకే సమయం సరిపోవడం లేదని ఆమె స‌సేమిరా అనేస్తూ వచ్చారు.

అయితే రీసెంట్‌గా ఓ ఛానెల్ ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్ రోజాను యాంక‌ర్.. ‘చిరంజీవి సినిమాలో అవ‌కాశం వ‌స్తే యాక్ట్ చేస్తారా?’ అని ప్రశ్నించగా.. తాను ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నానని.. ఒకవేళ చిరంజీవి, నాగార్జున సినిమాల్లో కనుక అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని చెప్పారు.

కాగా బాలయ్య, బోయపాటి సినిమాలో విలన్ పాత్రకోసం, అల్లు అర్జున్, సుకుమార్‌ల ‘పుష్ప’లో కీలకపాత్ర కోసం రోజాను అప్రోచ్ అయినట్లు వార్తలు వచ్చాయి. రోజా చివరిగా షాజీ కైలాస్ డైరెక్ట్ చేసిన ‘En Vazhi Thani Vazhi’(ఎన్ వాళి తాని వాళి) అనే తమిళ చిత్రంలో కనిపించారు.