RRR: ఆర్ఆర్ఆర్@4 ఏళ్ళు.. ఇన్ని రోజులు ఏం చేశారు?

సినిమా కమిట్ అయ్యి 4 ఏళ్లు.. షూటింగ్ స్టార్ట్ చేసిమూడు సంవత్సరాలు.. ఇద్దరు స్టార్ హీరోలు.. ఒక టాప్ డైరెక్టర్.. అంతా కలిస్తే ఓ ట్రిపుల్ ఆర్. సరిగ్గా 4 ఏళ్ల నుంచి టాలీవుడ్ జనాల్నే..

RRR: ఆర్ఆర్ఆర్@4 ఏళ్ళు.. ఇన్ని రోజులు ఏం చేశారు?

Rrr

RRR: సినిమా కమిట్ అయ్యి 4 ఏళ్లు.. షూటింగ్ స్టార్ట్ చేసిమూడు సంవత్సరాలు.. ఇద్దరు స్టార్ హీరోలు.. ఒక టాప్ డైరెక్టర్.. అంతా కలిస్తే ఓ ట్రిపుల్ ఆర్. సరిగ్గా 4 ఏళ్ల నుంచి టాలీవుడ్ జనాల్నేకాదు.. ఆల్ ఓవర్ ఇండియా వైడ్ హాట్ టాపిక్ అయిన ట్రిపుల్ ఆర్ సినిమా అంత ఈజీగా ఆడియన్స్ ముందుకు రావడం లేదు. ట్రిపుల్ ఆర్ కి సంబందించి అసలు ఈ నాలుగేళ్లలో ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.

Bollywood Film Releases: వారానికో సినిమా.. కాస్కో అంటోంది బాలీవుడ్!

ఇలా మూడేళ్ల క్రితం ట్రిపుల్ ఆర్ సినిమా స్టార్ట్ అయ్యింది. అంతకన్నా ఓ సంవత్సరం ముందే తారక్, ఎన్టీఆర్, రాజమౌళి కలిసి క్రేజీ గా ఓ ఫోటో పోస్ట్ చేసి ట్రిపుల్ ఆర్ సినిమా అనౌన్స్ చేశారు. 4 ఏళ్లక్రితం మొదలైన ట్రిపుల్ ఆర్.. ఎప్పటికప్పుడు ఆడియన్స్ ని ఎగ్జైట్ చేస్తూనే ఉంది. సినిమా మీద ఏమాత్రం ఇంట్రస్ట్ తగ్గకుండా ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తూనే ఉంది ట్రిపుల్ ఆర్ టీమ్. అసలు ట్రిపుల్ ఆర్ ఈనాలుగేళ్లో ఏం చేసింది..?

Tollywood Directors: డైరెక్టర్‌లు రెడీ.. స్టార్ హీరోల సినిమాలు స్టార్టయ్యేదెప్పుడు?

4 ఏళ్ల క్రితం ఆలోచనకి సంవత్సరం పాటు సినిమాకు సంబందించి ప్రీ ప్రొడక్షన్, షెడ్యూల్స్, సెట్స్, కాస్ట్యూమ్స్ ఇలా అన్ని రకాలుగా హోమ్ వర్క్ చేసుకుని మూడేళ్ల నాడు సెట్లోకి అడుగుపెట్టింది ట్రిపుల్ ఆర్. షూటింగ్ స్టార్ట్ అయ్యిందో లేదో కోవిడ్ తో కొన్నాళ్లు బ్రేక్ పడింది. తర్వాత సినిమా స్టార్ట్ అయిన 6 నెలల వరకూ అసలు హీరోయిన్సే దొరకలేదు ట్రిపుల్ ఆర్ కు. ఆ తర్వాత చరణ్ కి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ఫిక్స్ అయ్యింది. కానీ ఎన్టీఆర్ కోసం హాలీవుడ్ నుంచి వచ్చిన హీరోయిన్ ఎడ్గర్ జోన్స్ పర్సనల్ రీజన్స్ తో వెళ్లిపోయింది. మళ్లీ అతి కష్టం మీద హీరోయిన్ ఒలీవియా మోరిస్ దొరకడంతో షూటింగ్ కంటిన్యూ చేశారు.

Pushpa: బన్నీ మేనియా.. కేరళలో స్పెషల్ షోస్ బుకింగ్ స్టార్ట్!

అంతకుముందే షూటింగ్ లో దెబ్బలు తగిలి ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఒకరి తర్వాత ఒకరు షూట్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. ఇలా షూట్ క్యాన్సిల్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి సినిమా డిలే అయ్యింది. ఇక షూటింగ్ కి ఎక్కడా బ్రేకుల్లేవు అనుకుంటుండగానే.. సైరా ప్రమోషన్లు అడ్డం పడ్డాయి. సైరా సినిమాకు ప్రొడ్యూసర్ గా చేసిన రామ్ చరణ్ సినిమా ప్రమోషన్ల కోసం ట్రిపుల్ ఆర్ సినిమాకు గ్యాప్ ఇచ్చారు. ఎన్టీఆర్ కూడా పర్సనల్ రీజన్స్ తో సినిమాకు బ్రేక్ తీసుకున్నాడు. దాంతో మళ్లీ సినిమా మొదటి కొచ్చింది. సెకండ్ వేవ్ తర్వాత హాలీవుడ్ యాక్టర్స్ రావడానికి లేట్ అవ్వడంతో అక్కడ కూడా డిలే ఫేస్ చేసింది ట్రిపుల్ ఆర్.

Krithi Shetty: లిప్‌లాక్ ఒకే.. బేబమ్మ హద్దులు చెరిపేసిందా?

టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ స్టార్ కాస్ట్ కూడా నటిస్తున్న ఈ సినిమా ఎంతో ప్లాన్ చేసి జులై 33 2020న రిలీజ్ చేద్దామని ప్లాన్ చేశారు రాజమౌళి. కానీ కోవిడ్ తో పాటు రకరకాల కారణాలతో సినిమా కంప్లీట్ అవ్వక 2021 అక్టోబర్ 13న సినిమా రిలీజ్ చేస్తున్నట్టు అప్పట్టో కొత్త రిలీజ్ డేట్ ఇచ్చారు. కానీ సెకండ్ వేవ్ తో అది కూడా సాధ్యం కాక ఏకంగా సినిమాని జనవరి 7 2022న రిలీజ్ చేస్తున్నామని ముచ్చటగా మూడో డేట్ ఫిక్స్ చేశారు రాజమౌళి. ఇలా సినిమా స్టార్ట్ చేసిన దగ్గరనుంచి సినిమా కష్టాలను ఎదుర్కొని ఫైనల్లీ మరో 50 రోజుల్లో ఆడియన్స్ ముందుకు రాబోతోంది ఆర్ఆర్ఆర్.