Evaru Meelo Koteeswarulu: బుల్లితెరపై ఆర్ఆర్.. ఎవరు మీలో కోటీశ్వరులు ఫస్ట్ గెస్ట్ ఎవరంటే?

బుల్లితెరపై మరోసారి ఎంట్రీ ఇవ్వబోతున్న స్టార్ హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అవుతున్నాడు.

Evaru Meelo Koteeswarulu: బుల్లితెరపై ఆర్ఆర్.. ఎవరు మీలో కోటీశ్వరులు ఫస్ట్ గెస్ట్ ఎవరంటే?

Ntr

Evaru Meelo Koteeswarulu: బుల్లితెరపై మరోసారి ఎంట్రీ ఇవ్వబోతున్న స్టార్ హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇప్పటకే ఈ ‘షో’కి సంబంధించిన కార్యక్రమాలు అన్నపూర్ణ స్టూడియోలో శరవేగంగా సాగుతుండగా.. ఈ షో ఫస్ట్ ఎపిసోడ్‌ని త్వరలో షూట్ చెయ్యబోతున్నారు. ఫస్ట్ డే షూటింగ్‍లో సెలబ్రిటీ గెస్ట్‌గా రామ్ చరణ్ రాబోతున్నారు. ఫస్ట్ ఎపిసోడ్‌లో ఆర్ఆర్(ఎన్టీఆర్, రామ్ చరణ్) సందడి చేయబోతున్నారు.

అయితే, ఫస్ట్ షూటింగ్ వీరి ఎపిసోడ్ జరిగినా కూడా ఫస్ట్ ఎపిసోడ్‌గా మాత్రం ఈ ఎపిసోడ్ ప్రసారం చెయ్యరని అంటున్నారు. ఈ ఎపిసోడ్‌ని ప్రత్యేకంగా ప్రసారం చేస్తారని చెబుతున్నారు. ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో నటిస్తున్న జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లు ఆన్ సెట్స్ మీదే కాదు.. బయట కూడా కలిసిపోయి ఉంటారు. ఈ క్రమంలోనే చరణ్‌తోనే ఫస్ట్ ఎపిసోడ్ చేయబోతున్నారు ఎన్టీఆర్.. వెండితెరపై ఆర్(రాజమౌళి) దర్శకత్వంలో ఆర్ఆర్(ఎన్టీఆర్, రామ్ చరణ్) ఎటువంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అని ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. అంతకుముందే వీరిద్దరి కాంబినేషన్ బుల్లితెరపై ఆర్ఆర్ ది బెస్ట్ ప్రోగ్రామ్ అవ్వొచ్చని అంచనా..

ఈ షోకి సెలబ్రిటీ గెస్ట్ వస్తే, వచ్చిన మొత్తం డబ్బును ఏదైనా చారిటీకి ఇవ్వవలసి ఉంటుంది. మరి రామ్ చరణ్ ఎవరి కోసం ఈ గేమ్ ఆడుతాడో చూడాలి. హిందీలో కౌన్ బనేగా కరోడ్ పతి షో ఆధారంగా వస్తుంది ఎవరు మీలో కోటీశ్వరులు. గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు అంటూ కింగ్ నాగార్జున బుల్లితెరపై సందడి చేయగా.. ఇప్పుడు ఎన్టీఆర్ చెయ్యబోతున్నాడు. ఎన్టీఆర్ ఎనర్జీతో ఈ షోని ఎలా చేస్తాడో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఇటీవల రోర్‌ ఆఫ్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ పేరుతో మేకింగ్‌ వీడియోను విడుదల చేసింది ఆర్ఆర్ఆర్ యూనిట్. ఈ వీడియోకి కూడా అధ్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.