RRR In Oscars: ఒకటి కాదు రెండు కాదు.. ఐదు విభాగాల్లో ఆస్కార్ బరిలో నిలవనున్న ఆర్ఆర్ఆర్..?

టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీగా ‘ఆర్ఆర్ఆర్’ ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో.. ఆ అంచనాలు అందుకోవడంలో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో మనం చూశాం. ఈ క్రమంలోనే వెరైటీ మ్యాగజిన్ 2023 ఆస్కార్ నామినేషన్స్ విషయంలో తన ప్రిడిక్షన్‌ను ఇప్పటికే వెల్లడించింది. కాగా, ఈ జాబితాలో ఆర్ఆర్ఆర్ సినిమాలోని తన పర్ఫార్మెన్స్‌కు జూనియర్ ఎన్టీఆర్ ఆస్కార్ బరిలో నిల్చునే అవకాశం ఉందని ఈ మ్యాగజిన్ పేర్కొంది.

RRR In Oscars: ఒకటి కాదు రెండు కాదు.. ఐదు విభాగాల్లో ఆస్కార్ బరిలో నిలవనున్న ఆర్ఆర్ఆర్..?

RRR In Oscars For Five Categories In Variety Prediction

Updated On : September 16, 2022 / 3:56 PM IST

RRR: టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీగా ‘ఆర్ఆర్ఆర్’ ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో.. ఆ అంచనాలు అందుకోవడంలో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో మనం చూశాం. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లు కలిసి నటించడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. ఫలితంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది.

RRR Movie : కేరళలో బన్నీ రికార్డుని బద్దలు కొట్టిన ఎన్టీఆర్-రామ్ చరణ్.. మలయాళంలో RRR సినిమాకి అదిరిపోయిన టీఆర్పీ..

ఇక ఈ సినిమాలోని హీరోల నటనకు అందరూ మంత్రముగ్ధులయ్యారు. ముఖ్యంగా భీమ్ పాత్రలో తారక్ పర్ఫార్మెన్స్ గురించి గ్లోబల్ వైడ్‌గా చర్చ సాగుతూ ఉంది. ఈ క్రమంలోనే వెరైటీ మ్యాగజిన్ 2023 ఆస్కార్ నామినేషన్స్ విషయంలో తన ప్రిడిక్షన్‌ను ఇప్పటికే వెల్లడించింది. కాగా, ఈ జాబితాలో ఆర్ఆర్ఆర్ సినిమాలోని తన పర్ఫార్మెన్స్‌కు జూనియర్ ఎన్టీఆర్ ఆస్కార్ బరిలో నిల్చునే అవకాశం ఉందని ఈ మ్యాగజిన్ పేర్కొంది. అయితే తాజాగా ఆర్ఆర్ఆర్ ఏకంగా 5 విభాగాల్లో ఆస్కార్ అవార్డుల బరిలో నిల్చోగలదని వెరైటీ మ్యాగజిన్ తెలిపింది.

NTR In Oscar Race: ఆస్కార్ బరిలో ఎన్టీఆర్..? వెరైటీ మ్యాగజైన్ ప్రెడిక్షన్స్..

ఇందులో ఉత్తమ దర్శకుడు విభాగంలో ఎస్ఎస్ రాజమౌళి, ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ సినిమా విభాగంలో RRR, ఉత్తమ నటుడు విభాగంలో జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే,
ఉత్తమ ఒరిజినల్ సాంగ్ – దోస్తీ అని ఐదు విభాగాల్లో ఆర్ఆర్ఆర్ నామినేట్ అయ్యే అవకాశం ఉందని వెరైటీ మ్యాగజిన్ జోస్యం చెప్పుకొచ్చింది. ఇక తాజాగా రామ్ చరణ్ పేరు కూడా ఆస్కార్ బరిలో ఉంటుందనే వార్తతో మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో దుమ్ములేపుతున్నారు. తమ అభిమాన హీరోకు ఆస్కార్ అవార్డు రావడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సరికొత్త ప్రిడిక్షన్‌తో మరోసారి ఆర్ఆర్ఆర్ ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది.