Sukumar: తెరపైకి పుష్ప మల్టీవర్స్.. తగ్గేదే లే అంటోన్న సుకుమార్..?

పుష్ప తొలి భాగం సాధించిన ఘనవిజయంతో ఈ సినిమాకు సీక్వెల్ గా ‘పుష్ప-2’ను తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. అయితే ఈ సినిమాను భారీ స్థాయిలో రూపొందించేందుకు సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడు. కాగా ఈ సినిమాతో సుకుమార్ మల్టీవర్స్ ను క్రియేట్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Sukumar: తెరపైకి పుష్ప మల్టీవర్స్.. తగ్గేదే లే అంటోన్న సుకుమార్..?

Rumours Of Sukumar Canning Pushpa As Multiverse Movie

Sukumar: టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప-ది రైజ్’ ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసి ప్రస్తుతం రష్యన్ బాక్సాఫీస్ ను ఓ ఆటాడుకునేందుకు అక్కడి భాషలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీగా సుకుమార్ మలిచిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక పుష్పరాజ్ పాత్రలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాను మరో లెవెల్ కు తీసుకెళ్లడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కళ్లుచెదిరే వసూళ్లను రాబట్టింది.

Director Sukumar: కార్తికేయ నిర్మాతలతో సుకుమార్ తదుపరి సినిమా.. హీరో అతడేనా?

పుష్ప తొలి భాగం సాధించిన ఘనవిజయంతో ఈ సినిమాకు సీక్వెల్ గా ‘పుష్ప-2’ను తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. అయితే ఈ సినిమాను భారీ స్థాయిలో రూపొందించేందుకు సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడు. కాగా ఈ సినిమాతో సుకుమార్ మల్టీవర్స్ ను క్రియేట్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా క్లైమాక్స్ లో మరో స్టార్ హీరోను ఇంట్రొడ్యూస్ చేసి, పుష్ప మల్టీవర్స్ ను కొనసాగించాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడట.

Sukumar: పుష్ప-2 కోసం సుకుమార్ కొత్త అవతారం..?

ఇటీవల ఈ మల్టీవర్స్ ఫార్మాట్ లో వస్తున్న సినిమాలకు ప్రేక్షకుల దగ్గర్నుండి అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది. ఇప్పటికే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్, హిట్ వర్స్ అని రెండు సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. ఈ మల్టీవర్స్ లో మరిన్ని సినిమాలు రాబోతున్నట్లు చిత్ర దర్శకనిర్మాతలు తెలిపారు. ఇప్పుడు ఇదే తరహాలో సుకుమార్ కూడా పుష్ప మల్టీవర్స్ ను క్రియేట్ చేసి, పుష్ప-2 క్లైమాక్స్ లో చిట్టిబాబును పరిచయం చేయాలని చూస్తున్నాడు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ‘రంగస్థలం’, పుష్ప రెండు కూడా ఒకే కాలంలో జరిగే కథలుగా సుకుమార్ మనకు చూపించాడు. దీంతో ఇప్పుడు ఈ పుష్ప మల్టీవర్స్ అనే కాన్సెప్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.