Prabhas Movies: పాపం ప్రభాస్.. ఆగని గ్లోబల్ స్టార్ వాయిదాల పర్వం!

వాయిదాబాటలో నడుస్తూనే ఉన్నారు గ్లోబల్ స్టార్. ఒక సినిమా కొత్త డేట్ ఫిక్స్ చేసుకుందంటే ప్రభాస్ మరో సినిమా పోస్ట్ పోన్ అవుతోంది. రాధేశ్యామ్ తర్వాత సలార్ ఇప్పుడు కొత్తగా ఆదిపురుష్..

Prabhas Movies: పాపం ప్రభాస్.. ఆగని గ్లోబల్ స్టార్ వాయిదాల పర్వం!

Prabhas Movies: వాయిదాబాటలో నడుస్తూనే ఉన్నారు గ్లోబల్ స్టార్. ఒక సినిమా కొత్త డేట్ ఫిక్స్ చేసుకుందంటే ప్రభాస్ మరో సినిమా పోస్ట్ పోన్ అవుతోంది. రాధేశ్యామ్ తర్వాత సలార్ ఇప్పుడు కొత్తగా ఆదిపురుష్ ఈ పోస్ట్ పన్ లిస్ట్ లో చేరింది. ఈసారి ఆమీర్ ఖాన్ కోసం రెబల్ స్టార్ పక్కకి తప్పుకోక తప్పలేదు.

Bheemla Nayak: కలెక్షన్ల సునామీకి పవర్ స్టార్ స్కెచ్… ఫ్యాన్స్‌కు పునకాలే!

ఆగస్ట్ 11 నుంచి ప్రభాస్ ఆదిపురుష్ పక్కకు తప్పుకుంది. ప్రభాస్ రాముడిగా, కృతీసనన్ సీతగా నటించిన ఆదిపురుష్.. 2022 ఆగస్ట్ 11నే వస్తుందంటూ మొదటి నుంచి చెప్తున్నాడు డైరెక్టర్ ఓం రౌత్. దానికి తగ్గట్టే కొవిడ్ టైమ్ లోనూ త్వరగానే మూవీ షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టాడు. 4వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఆదిపురుష్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఇలాంటి టైమ్ లో ఆదిపురుష్ కు చెక్ పెట్టాడు లాల్ సింగ్ చద్దా.

Movies Leakage: లీకుల బెడద.. ఇప్పుడు మరింత స్ట్రిక్ట్!

నిజానికి ఏప్రిల్ 14న లాల్ సింగ్ చద్దా రిలీజ్ అని గతంలో ప్రకటించారు మేకర్స్. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ బ్యాలెన్స్ ఉండటంతో ఆగస్ట్ 11కు వాయిదా వేస్తున్నట్టు రీసెంట్ గా అనౌన్స్ చేశారు. అలాగే ఏప్రిల్ 14న కేజీఎఫ్2, బీస్ట్, జెర్సీ లాంటి సినిమాలు డేట్ ఫిక్స్ చేసుకున్నాయి. సో వాటితో పోటీ లేకుండా ఆదిపురుష్ మేకర్స్ టీ సిరీస్ నిర్మాతలతో డీల్ కుదుర్చుకుని ఆగస్ట్ 11న వచ్చేందుకు రెడీఅయ్యారు ఆమీర్ ఖాన్. ఇక ప్రభాస్ ఫస్ట్ స్టైయిట్ హిందీ మూవీ ఆదిపురుష్ కోసం కొత్త డేట్ వెతికే పనిలో ఉన్నారు దర్శకనిర్మాతలు.

Aishwarya Dharnush: ధనుష్-ఐశ్వర్య విడాకులు.. వెనక్కు తగ్గారా?

కొవిడ్ తో ఎన్నో వాయిదాల తర్వాత మార్చ్ 11న థియేటర్స్ కొచ్చేందుకు రాధేశ్యామ్ వెయిట్ చేస్తుంది. అటు ప్రశాంత్ నీల్ కాంబోలో ప్రభాస్ చేస్తున్న సలార్ ఏప్రిల్ 14 నుంచి గతంలోనే షిఫ్ట్ అయింది. జూలై 29కి సలార్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇలా వాయిదాల పర్వం కొనసాగించిన రాధేశ్యామ్, సలార్ తర్వాత కొత్తగా ఆ లిస్ట్ లో ఆదిపురుష్ చేరింది. ఈ పోస్ట్ పోన్ ఎఫెక్ట్ గ్లోబల్ స్టార్ నెక్ట్స్ మూవీస్ పై పడే అవకాశం కూడా లేకపోలేదు.