Apollo : సాయిధరమ్ తేజ్ హెల్త్ బులెటిన్, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ?

హైదరాబాద్‌ కేబుల్ బ్రిడ్జిపై ప్రమాదంలో గాయపడ్డ సినీ నటుడు సాయిధరమ్‌ తేజ్‌ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోంది. 2021, సెప్టెంబర్ 13వ తేదీ సోమవారం మరో హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.

Apollo : సాయిధరమ్ తేజ్ హెల్త్ బులెటిన్, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ?

Sai

Sai Dharam Tej : హైదరాబాద్‌ కేబుల్ బ్రిడ్జిపై ప్రమాదంలో గాయపడ్డ సినీ నటుడు సాయిధరమ్‌ తేజ్‌ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోంది. 2021, సెప్టెంబర్ 13వ తేదీ సోమవారం మరో హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఐసీయీలో చికిత్స కొనసాగుతోందని, ఆరోగ్యం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందుల కారణంగా..వెంటిలెటర్ పై చికిత్స కొనసాగుతోందని వైద్యులు వెల్లడించారు. అయితే…సాయిధర్మ తేజ్ చికిత్సకు సహకరిస్తున్నారని, మొదట్లో ఉన్న దానికన్నా వెంటిలెటర్ అవసరం రోజురోజుకు తగ్గుతోందని తెలిపారు.

Read More : Sai Dharam Tej : హీరో సాయి ధరమ్‌ తేజ్‌కు కాలర్ బోన్ సర్జరీ

ఇదిలా ఉంటే…కాలర్‌ బోన్‌ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు వైద్యులు. కాలర్‌ బోన్‌ నొప్పి ఎక్కువ అవడంతో సర్జరీ చేశామన్నారు. సాయి తేజ్‌ ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. నిజానికి రెండ్రోజుల తర్వాతే కాలర్‌బోన్‌ సర్జరీ చేయాలని వైద్యులు భావించారు. అయితే స్పృహలోకి వచ్చినప్పుడు కాలర్‌బోన్‌ నొప్పి ఉందని చెప్పడంతో ముందుగానే సర్జరీ చేశారు. అన్ని పరీక్షలు చేసి…త్వరగా సర్జరీ చేస్తే ఇబ్బంది  లేదని…ఎలాగు వెంటిలెటర్‌పై ఉన్నాడు కాబట్టి సర్జరీ చేయవచ్చని నిర్ణయించారు.

Read More : Sai Dharam Tej : నిలకడగా సాయిధరమ్ తేజ్‌ ఆరోగ్యం…హెల్త్ బులిటెన్ విడుదల

సాయిధరమ్‌ తేజ్‌ శరీరం లోపల ఎలాంటి గాయాలు లేవని వైద్యులు నిర్ధారించారు. ఎమ్‌ఆర్‌ఐ (MRI) స్కాన్‌లో కూడా అంతా నార్మల్‌గా ఉందని వైద్యులు తెలిపారు. తేజ్ చికిత్సకు సహకరిస్తున్నారని చెప్పారు. తేజ్ స్పృహలోకి వస్తున్నాడని, మాట్లాడుతున్నారని తెలుస్తోంది. ఈ నెల 10న సాయిధరమ్‌ తేజ్‌ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి సమీపంలో బైక్ పై స్కిడ్ అయి కింద పడ్డాడు. ప్రమాదానికి అతివేగం, నిర్లక్ష్యమే కారణమని పోలీసులు ప్రాధమికంగా నిర్థారించారు. బైక్ ప్రమాదంపై విచారణ జరుపుతున్నారు.