Saif Alikhan : ఇంకెందుకు మా బెడ్ రూమ్ లోకి కూడా వచ్చేయండి.. మీడియా మీద కౌంటర్ వేసిన బాలీవుడ్ స్టార్ హీరో..

తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ శుక్రవారం రాత్రి తన భార్యతో కలిసి ఓ పార్టీకి వెళ్లి ఇంటికి వస్తుంటే మీడియా వాళ్ళు, మరికొంతమంది తమ కెమెరాలు పట్టుకొని సైఫ్ వెనక పడ్డారు, ఫోటోలు, వీడియోలు అడిగారు.................

Saif Alikhan : ఇంకెందుకు మా బెడ్ రూమ్ లోకి కూడా వచ్చేయండి.. మీడియా మీద కౌంటర్ వేసిన బాలీవుడ్ స్టార్ హీరో..

Saif Ali Khan countered the media following him

Saif Alikhan :  సెలబ్రిటీలు ఎప్పుడు ఏం చేస్తారు, ఎలా ఉంటారు అంటూ మీడియా, సోషల్ మీడియా, అభిమానులు వాళ్ళ వెనకాల పడుతూనే ఉంటారు. ఇక బాలీవుడ్ లో అయితే కొంతమంది సపరేట్ గా వీడియోలు, ఫోటోలు తీస్తూ సెలబ్రిటీల ఇంటి ముందే పడిగాపులు కాస్తూ ఉంటారు. ఈ కల్చర్ ఇంకా మనదాకా రాలేదు. మనదగ్గర ఏదైనా అకేషన్ ఉన్నప్పుడే మీడియా సెలబ్రిటీల ఇంటి ముందుకు వెళ్తుంది. కానీ బాలీవుడ్ లో దాదాపు చాలా మంది సెలబ్రిటీల ఇంటి ముందు, షూటింగ్స్ సెట్స్ బయట కొంతమంది మీడియా వాళ్ళు, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కెమెరాలు పట్టుకొని సెలబ్రిటీలు ఎప్పుడు కనపడతారా, వాళ్ళని ఎప్పుడు వీడియోలు తీయాలా, ఫోటోలు తీయాలా, మాట్లాడించాలా అని రెడీగా ఉంటారు.

Megha Akash : హీరోయిన్ మేఘ ఆకాష్ ఇంట్లో విషాదం.. నువ్వు లేకుండా ఎలా బతకాలి అంటూ ఎమోషనల్ పోస్ట్..

ఒక్కోసారి వీళ్ళ ప్రవర్తనతో పలువురు సెలబ్రిటీలు విసిగి చెంది కొన్ని సార్లు వాళ్ళ మీద ఫైర్ అయ్యారు కూడా. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ శుక్రవారం రాత్రి తన భార్యతో కలిసి ఓ పార్టీకి వెళ్లి ఇంటికి వస్తుంటే మీడియా వాళ్ళు, మరికొంతమంది తమ కెమెరాలు పట్టుకొని సైఫ్ వెనక పడ్డారు, ఫోటోలు, వీడియోలు అడిగారు. సైఫ్ తన భార్య కరీనా కపూర్ తో లోపలికి వెళ్తుంటే కొంతమంది వెనకే పడుతూ లోపలి కూడా వెళ్లిపోతుంటే సైఫ్.. ఇంకెందుకు మా బెడ్ రూమ్స్ లోకి కూడా వచ్చేయండి అంటూ కౌంటర్ ఇచ్చి వెళ్ళిపోయాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసి సెలబ్రిటీలకు కనీసం కొంచెమన్నా ప్రైవసీ ఇవ్వాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.