బొగ్గు గనుల్లో బుల్లెట్‌పై ‘సలార్’

బొగ్గు గనుల్లో బుల్లెట్‌పై ‘సలార్’

Salaar Shooting: పాన్ ఇండియా స్టార్ మన టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్, ‘కె.జి.యఫ్’ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో, హోంబలే ఫిలింస్ బ్యానర్లో విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘సలార్’.. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే సింగరేణిలో స్టార్ట్ అయ్యింది.

షూటింగ్ స్టార్ట్ అయినప్పటినుంచి ‘సలార్’ సెట్స్ పిక్స్ సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి. తాజాగా మరో ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ పిక్‌లో ప్రభాస్‌ బొగ్గు గనుల్లో బుల్లెట్‌ నడుపుతూ కనిపించాడు.
https://10tv.in/madhu-guruswamy-to-play-antagonist-in-salaar-movie/

ప్రభాస్ బైక్ మెకానిక్‌గా కనిపించనున్నాడని తెలుస్తోంది. కన్నడలో పలు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు మధు గురుస్వామి ఈ చిత్రంలో విలన్‌గా కనిపించనున్నారు. మిగతా పాత్రల్లో దాదాపు కొత్త నటీనటులు కనిపించబోతున్నారు.

Prabhas