సల్మాన్.. షారుక్.. ఖాన్ మల్టీ స్టారర్.. పఠాన్!

  • Published By: vamsi ,Published On : November 6, 2020 / 04:37 PM IST
సల్మాన్.. షారుక్.. ఖాన్ మల్టీ స్టారర్.. పఠాన్!

Salman Khan and Shah Rukh Khan:బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్‌లకు ఉన్న క్రేజ్ వేరు.. వీరు విడివిడిగా వెండితెరపై కనిపిస్తేనే బాక్సాఫీస్‌లు షేక్ అయిపోతాయి. అటువంటిది ఇద్దరూ కలిసి ఒకే తెరపై కనిపిస్తే.. ఇక అభిమానులను ఆపడం కష్టమే కదా? ఈ ఇద్దరు కలిసి ఇప్పుడు ఒకే సినిమాలో నటించబోతున్నారు.



షారుఖ్-సల్మాన్ జంట వెండితెరపై మల్టీస్టారర్‌లో కనిపించబోతున్నారు. బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ మరియు షారుఖ్ ఖాన్ కలిసి సినిమా చెయ్యాలని అభిమానులు ఎంతోకాలంగా కోరుకుంటూ ఉండగా.. ఇప్పుడు ఆ అభిమానుల కోరిక నెరవేరబోతుంది. సినిమాల అభిమానులు కోరుకున్నట్లుగా సల్మాన్, షారుఖ్‌‍లు కలిసి నటించబోతున్నారు. ఇంతకుముందు ఇద్దరూ ఒకరికొకరు సినిమాల్లో అతిధి పాత్రలు చేశారు.



https://10tv.in/3-tv-serial-actresses-rescued-as-prostitution-racket-busted-after-raid-at-five-star-hotel-in-mumbai/
షారుఖ్ ఖాన్ చాలా కాలం నుంచి సినిమాలకు దూరంగా ఉన్నాడు. 2018 లో జీరో సినిమా తర్వాత అతను ఏ సినిమా చేయలేదు. అయితే ఇప్పడు షారుఖ్ రెండు ప్రాజెక్టులలో పనిచేయడం ప్రారంభించాడని ఫిల్మ్ కారిడార్ల నుంచి నివేదికలు వస్తున్నాయి.



అయితే దీనిపై ఖచ్చితమైన సమాచారం మాత్రం లేదు. కానీ త్వరలో ‘పఠాన్’ అనే సినిమాలో వీరు కనిపించబోతున్నారని, దీనికి సన్నాహాలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ చిత్రంలోనే షారుఖ్ ఖాన్‌తో సల్మాన్ కనిపించనున్నట్లు సమాచారం.