Salman Khan : 1000 కోట్లిస్తే ఖాళీగా ఇంట్లో కూర్చుంటా.. నాకు అసలు బిగ్‌బాస్‌‌కి హోస్ట్ చేయాలని లేదు..

గ్‌బాస్‌ షో హోస్టింగ్ గురించి మాట్లాడుతూ.. ''నాకు అసలు ఆ షోని హోస్ట్ చేయడం ఇష్టం లేదు. కానీ తప్పట్లేదు. నాకు చాలా సార్లు షోలో చిరాకు వస్తుంది. హోస్ట్ చేయను అని.................

Salman Khan : 1000 కోట్లిస్తే ఖాళీగా ఇంట్లో కూర్చుంటా.. నాకు అసలు బిగ్‌బాస్‌‌కి హోస్ట్ చేయాలని లేదు..

Salman Khan reacts on his Remuneration for BiggBoss

Salman Khan :  బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హిందీ బిగ్‌బాస్‌‌కి గత కొన్ని సీజన్స్ నుంచి హోస్ట్ చేస్తూనే ఉన్నాడు. బిగ్‌బాస్‌‌ నిర్వాహకులు కూడా సల్మాన్ ఖాన్ ని హోస్ట్ గా మార్చట్లేదు. అయితే ఈ షోకి సల్మాన్ ఖాన్ తీసుకునే రెమ్యునరేషన్ పై ఎప్పుడూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. కొన్ని వందల కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటాడని భావిస్తారు. ఈ సారి కొత్త సీజన్ కి అయితే ఏకంగా సల్మాన్ ఖాన్ అన్ని ఖర్చులు కలిపి దాదాపు 1000 కోట్లు తీసుకున్నాడని టాక్ నడుస్తుంది.

తాజగా సల్మాన్ ఖాన్ ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ దీనిపై స్పందించాడు. సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. ”నేనే అంత రెమ్యునరేషన్ తీసుకుంటే అసలు జీవితంలో పని చేయకుండా ఖాళీగా కూర్చుంటాను. ఇది ఎప్పటికైనా నిజం అయితే బాగుండు. నాకు అందులో పావు వంతు కూడా రాదు. అయినా అంత రెమ్యునరేషన్ తీసుకుంటే దాంట్లో సగం నా లాయర్స్ ఫీజులకే అయిపోతుంది. అయినా ఈ వార్తలని ఆదాయపు పన్ను శాఖ‌, ఈడీ వాళ్లు కూడా చదువుతారు, కాస్త జాగ్రత్తగా రాయండి” అని సరదాగా నవ్వుతూ చెప్పారు.

Satya Dev : చిరంజీవి అన్నయ్య భోజనానికి పిలిచి కథ చెప్తే ఒప్పుకోకుండా ఉంటామా??

ఇక బిగ్‌బాస్‌ షో హోస్టింగ్ గురించి మాట్లాడుతూ.. ”నాకు అసలు ఆ షోని హోస్ట్ చేయడం ఇష్టం లేదు. కానీ తప్పట్లేదు. నాకు చాలా సార్లు షోలో చిరాకు వస్తుంది. హోస్ట్ చేయను అని నిర్వాహకులకు కూడా చెప్పాను. కానీ వాళ్ళకి మరో ఛాయిస్ లేదు. వాళ్ళకి వేరే ఛాయిస్ దొరికితే నన్ను కచ్చితంగా వదిలేస్తారు” అని తెలిపారు. మరి ఈ వ్యాఖ్యలని పరిగణలోకి తీసుకొని బిగ్‌బాస్‌ నిర్వాహకులు వచ్చే సీజన్ అయినా సల్మాన్ ఖాన్ ని మారుస్తారేమో చూడాలి.