ఉగాది స్పెషల్ : ‘96’ రీమేక్ షూటింగ్ ప్రారంభం

త‌మిళ సూప‌ర్ హిట్ చిత్రాల‌లో ఒక‌టిగా నిలిచిన చిత్రం 96. విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన ఈ త‌మిళ చిత్రం ప్రేమ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కింది.

  • Published By: veegamteam ,Published On : April 5, 2019 / 06:07 AM IST
ఉగాది స్పెషల్ : ‘96’ రీమేక్ షూటింగ్ ప్రారంభం

త‌మిళ సూప‌ర్ హిట్ చిత్రాల‌లో ఒక‌టిగా నిలిచిన చిత్రం 96. విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన ఈ త‌మిళ చిత్రం ప్రేమ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కింది.

త‌మిళ సూప‌ర్ హిట్ చిత్రాల‌లో ఒక‌టిగా నిలిచిన చిత్రం 96. విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన ఈ త‌మిళ చిత్రం ప్రేమ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కింది. ఈ చిత్రం తెలుగు రీమేక్ రైట్స్ ను దిల్ రాజు సొంతం చేసుకున్నారు. అయితే ఇందులో విజ‌య్ సేతుప‌తి, త్రిష పాత్ర‌లని శర్వానంద్, సమంత నటిస్తున్నారు. రొమాంటిక్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈచిత్రం రికార్డులను తిరగరాసింది.
Read Also : బ్లేడుతో పనిలేదు: రాజకీయాలకు బండ్ల గణేష్ గుడ్‌బై

ఈ సినిమా ప్రారంభోత్సవం ఉగాది రోజున జరగనున్నట్లు తెలిసింది. ఆ రోజున ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటుల గురించి ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందని ఊహించవచ్చు. స్కూల్‌ టైమ్‌లో ప్రేమలో పడ్డ ఓ అబ్బాయి, అమ్మాయి ఆ తర్వాత విడిపోతారు. కొన్నేళ్ల తర్వాత కలిసిన ఈ ఇద్దరి మనోభావాలు ఎలా ఉంటాయి? అనే అంశంపై ఈ సినిమా కథనం ఉంటుంది.

అంతేకాదు వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని పట్టాలెక్కించాలనేది దిల్ రాజు ప్లాన్. తాజాగా ఈ చిత్ర టైటిల్ గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. మొదట ఈ చిత్రానికి జాను, జాను అలియాజ్ జానకి అనే టైటిల్స్ పరిశీలించారు. తాజాగా ‘జానకి దేవి’ అనే టైటిల్ ని దిల్ రాజు ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ కథని తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్చే పనిలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also : విప్రోలో పాకిస్తాన్ షేర్లు అమ్మిన కేంద్రం