Samantha: “రా ఏజెంట్”గా సమంత న్యూ వెబ్ సిరీస్..

అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన "ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్-2" తో బాలీవుడ్ లో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న సమంత, ఆ క్రేజ్ ని అలానే కంటిన్యూ చేయాలనుకుంటుంది. ఈ క్రమంలోనే సామ్ మరో రెండు హిందీ ప్రాజెక్ట్‌లకు సంతకం చేసినట్లు తెలుస్తుంది. వాటిలో ఒకటి బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్‌తో వెబ్ సిరీస్.

Samantha: “రా ఏజెంట్”గా సమంత న్యూ వెబ్ సిరీస్..

Samantha in Raw Agent Role

Samantha: అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన “ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్-2” తో బాలీవుడ్ లో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న సమంత, ఆ క్రేజ్ ని అలానే కంటిన్యూ చేయాలనుకుంటుంది. ఈ క్రమంలోనే సామ్ మరో రెండు హిందీ ప్రాజెక్ట్‌లకు సంతకం చేసినట్లు తెలుస్తుంది. వాటిలో ఒకటి బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్‌తో వెబ్ సిరీస్.

Samantha : సమంత పాన్ ఇండియా మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది

హాలీవుడ్ డైరెక్టర్స్ ‘రస్సో బ్రదర్స్’ అమెరికన్ షో “సిటాడెల్‌”కి ఇది అధికారిక రీమేక్. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఒరిజినల్ సిరీస్ గా తెరకెక్కుతున్న ఈ ‘సిటాడెల్‌’ ఇంగ్లీష్ వెర్షన్ లో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటిస్తున్న పాత్రను, హిందీ వెర్షన్ లో సమంత చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఈ పాత్రలో సామ్ రా ఏజెంట్ గా దర్శనమివ్వనుంది.

ఈ సిరీస్ ను 90ల కాలంలో తెరకెక్కించబోతున్నట్లు, సమంతా అండ్ వరుణ్ ధావన్ ఇద్దరూ కొత్త లుక్‌లో కనిపిస్తారని బీ-టౌన్ లో టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం సమంత, విజయ్ దేవరకొండతో నటిస్తున్న “ఖుషి” సినిమా షూటింగ్ లో ఉంది. నవంబర్ మధ్య నాటికి ఇది పూర్తీ చేసుకొని, నవంబర్ చివరి నుండి సిటాడెల్ రీమేక్ సెట్స్‌లో పాల్గొంటుందని ఫిల్మ్ సర్కిల్స్‌లో వార్తలు వస్తున్నాయి.