Samantha: వరుస ఆఫర్లు.. టాప్ గేర్‌లో దూసుకెళ్తున్న సామ్!

మైండ్ బ్లోయింగ్ యాక్టింగ్.. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో.. ఇన్నాళ్లు తెలుగు ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశిన స్యామ్.. ఇప్పుడు హిందీ, తమిళ భాషల్లో నటిస్తూ మెప్పిస్తోంది. తెలుగులోనూ వరస సినిమాలతో దూకుడు చూపిస్తోంది.

Samantha: వరుస ఆఫర్లు.. టాప్ గేర్‌లో దూసుకెళ్తున్న సామ్!

Samantha

Samantha: మైండ్ బ్లోయింగ్ యాక్టింగ్.. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో.. ఇన్నాళ్లు తెలుగు ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశిన స్యామ్.. ఇప్పుడు హిందీ, తమిళ భాషల్లో నటిస్తూ మెప్పిస్తోంది. తెలుగులోనూ వరస సినిమాలతో దూకుడు చూపిస్తోంది. లేటెస్ట్ గా ఓ పాన్ ఇండియా మూవీకీ సైన్ చేసి, ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

Samantha : చైతూతో విడాకుల తర్వాత సమంత ఫస్ట్ సినిమా.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..

చైతూతో డివోర్స్ తర్వాత ఇంకాస్త జోరు పెంచిన సమంతా.. ఇప్పుడు రూటు మార్చి టాప్ గేర్ వేసింది. బాలివుడ్ హీరోయిన్స్ కి టప్ కాంపిటీషన్ ఇచ్చేందుకు ఒక పక్క రెడీ అవుతోంది. మరో పక్క ఓ డెబ్యూ డైరెక్టర్ తో భారీ నిర్మాణ సంస్థలో పాన్ ఇండియా ప్రాజెక్ట్ కు సైన్ చేసింది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఇతర నటీనటులతో పాటు సాంకేతిక వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. మొన్నటిదాక సినిమాలు, పాత్రల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకున్న స్యామ్.. పుష్ప లో ఊ అంటావా మామా ఐటమ్ సాంగ్ చేయడంతో ఒక్కసారిగా పాన్ ఇండియా పాపులారిటీ దక్కించుకుంది.

Samantha : వాళ్ళిద్దరి నుంచి తప్పించుకోలేకపోతున్నాను

ఇప్పటికే ఫ్యామిలీ మెన్ సిరీస్ తో హిందీ ఆడియన్స్ కు దెగ్గరైన స్యామ్.. హిందీలో స్టార్ హీరోలతో సినిమాలు చేశి సత్తా చాటేందుకు ట్రై చేస్తోంది. ఇప్పుడు బోల్డ్ క్యారెక్టర్స్ కి కూడా ఓకే చెప్పేస్తోంది. అందుకే.. బాలివుడ్ ఫిల్మ్ మేకర్స్ ఇస్తున్న ప్రతి ఆఫర్ ని స్యామ్ ఓకే చేస్తుందట. ఇప్పటికే ఫ్యామిలీ మెన్ సిరీస్ డైరెక్టర్స్.. రాజ్ అండ్ డీకేతో మరో వెబ్ సిరీస్ లో నటించేందుకు ఓకే చెప్పింది.

Samantha: స్టైలిస్ట్ కోసం టవల్ చుట్టుకొచ్చిన సమంత

ఆల్రెడీ ఓ హాలీవుడ్ మూవీ అరేంజ్ మెంట్ ఆఫ్ లవ్ సినిమా లోనూ నటించనుంది సమంత. అటు హిందీ మూవీస్ కి ఓకే చెప్తూనే.. ఇటు తెలుగు, తమిళ్ లాంగ్వెజెస్ తో పాటు బైలింగ్వల్ మూవీస్ చేస్తోంది. ప్రస్తుతం స్యామ్, గుణశేఖర్ కాంబోలో తెరకెక్కుతోన్న శాకుంతలం షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది.. మరో మూవీ యశోద షూటింగ్ కూడా పూర్తి కావచ్చింది. ఇంకా విజయ్ దేవరకొండతో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో ఖుషి చేస్తోంది. ఇవి కాకుండా లేటెస్ట్ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఓ పాన్ ఇండియా మూవీ ప్రాజెక్ట్ కు సైన్ చేసింది. ఇలా వరుస ఆఫర్స్ తో మొత్తానికి దుమ్మురేపే దూకుడుతో ఓ ట్రెండ్ సెట్ చేశే పనిలో ఉంది ఈ బేబీ.