Samantha : విడాకుల తర్వాత వరుస సినిమాలని లైన్లో పెడుతున్న సమంత

విడాకులు అయిన తర్వాత వరసగా సినిమాలు చేయాలని, ఆ సినిమాలు కూడా డిఫరెంట్ గా ఉండాలని ప్లాన్ చేస్తుంది. అందుకే ఇప్పుడు వరుస సినిమాలని అనౌన్స్ చేస్తుంది. ఇవాళ అనౌన్స్ చేసినవే కాకుండా

Samantha : విడాకుల తర్వాత వరుస సినిమాలని లైన్లో పెడుతున్న సమంత

Sam (1)

Samantha :  చైతన్య సమంత విడాకుల వార్త చాలా రోజులు మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. తెలుగు సినీ ప్రేక్షకులంతా వాళ్ళ గురించే మాట్లాడుకున్నారు. కానీ చై, సామ్ ఇద్దరూ తమ షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. సామ్ విడాకుల తర్వాత ఇటీవలే ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ ప్రోగ్రాంలో కనిపించింది. సమంత ప్రస్తుతం తమిళ్ లో ఒక సినిమా చేస్తుంది. తెలుగులో ‘శాకుంతలం’ షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజాగా ఇవాళ దసరా రోజున సమంత తన నెక్స్ట్ సినిమాలని అనౌన్స్ చేసింది.

డ్రీం వారియర్స్ పిక్చర్స్ నిర్మాణంలో శాంతరూబన్ జ్ఞానశేఖరన్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్టు అనౌన్స్ చేసింది. ఇది తెలుగు తమిళ్ లో చిత్రీకరించనున్నారు. ఇది లేడీ ఓరియెంటెడ్ కథ అని సమాచారం. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవ్వబోతోంది. దీంతో పాటు మరో సినిమాని కూడా అనౌన్స్ చేసింది. శ్రీదేవి మూవీస్ నిర్మాణ సంస్థలో హరి, హరీష్ దర్శకత్వంలో మరో సినిమాని ప్రకటించింది సమంత. ఈ సినిమా నవంబర్ నుంచి షూటింగ్ మొదలుపెట్టనున్నట్టు సమాచారం. ఈ సినిమా కూడా లేడీ ఓరియెంటెడ్ అని సమాచారం.

Bigg Boss 5 : బిగ్ బాస్ లో అందరి కంటే వరస్ట్ ఎవరు??

సమంత సౌత్ లో స్టార్ హీరోయిన్. ఫ్యామిలీ మాన్ సిరీస్ తో నార్త్ లో కూడా బాగా పేరు తెచ్చుకుంది. ‘ఓ బేబీ’ సినిమా తప్ప వేరే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఏమి చేయలేదు. దీంతో హీరోల పక్కన కమర్షియల్ హీరోయిన్ గానే ఉంటూ స్టార్ అయింది. అనుష్క, నయనతార లాగా తాను కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు తీసి సపరేట్ ఫ్యాన్ బేస్ తెచ్చుకోవాలని చూస్తుంది. ఇక విడాకులు అయిన తర్వాత వరసగా సినిమాలు చేయాలని, ఆ సినిమాలు కూడా డిఫరెంట్ గా ఉండాలని ప్లాన్ చేస్తుంది. అందుకే ఇప్పుడు వరుస సినిమాలని అనౌన్స్ చేస్తుంది. ఇవాళ అనౌన్స్ చేసినవే కాకుండా ఇంకా కొన్ని కథలు వింటున్నట్టు సమాచారం. ఈ సినిమాలతో సమంత ఫుల్ ఫామ్ లోకి వచ్చి వరుస సినిమాలు చేయాలని ప్లాన్ చేసుకుంటుంది. సమంత మళ్ళీ సినిమాలు అనౌన్స్ చేయడంతో అభిమానులు ఆనందిస్తున్నారు.