Samantha : మరోసారి ఐటెం సాంగ్ చేయబోతున్న సమంత??

ఇటీవల వచ్చిన 'పుష్ప' సినిమాలో అల్లు అర్జున్ తో కలిసి 'ఊ అంటావా ఊ ఊ అంటావా' అంటూ ఊపేసింది. ఈ పాటకి దేశం నలుమూలల నుంచి భారీ స్పందన వచ్చింది. ఈ పాటలో సమంత స్టెప్పులు, హావభావాలతో......

Samantha : మరోసారి ఐటెం సాంగ్ చేయబోతున్న సమంత??

Samantha (1)

 

Samantha :  చైతూతో విడాకుల తర్వాత సమంత ఫుల్ ఫామ్ లో దూసుకుపోతుంది. వరుస సినిమాలకి ఓకే చెప్తుంది. వచ్చిన ప్రతి ఛాన్స్ ని వాడుకుంటుంది. ఒక పక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలు, మరోవైపు కమర్షియల్ సినిమాలు, వీటితో పాటు ఐటెం సాంగ్స్ లో కూడా దుమ్ము లేపుతుంది. ఇటీవల వచ్చిన ‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ తో కలిసి ‘ఊ అంటావా ఊ ఊ అంటావా’ అంటూ ఊపేసింది. ఈ పాటకి దేశం నలుమూలల నుంచి భారీ స్పందన వచ్చింది.

 

ఈ పాటలో సమంత స్టెప్పులు, హావభావాలతో అదరగొట్టేసింది. మొదటి సారి ఐటెం సాంగ్ చేయడంతో సమంత అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఈ సాంగ్ ని మళ్ళీ మళ్ళీ చూశారు. సినిమాకి ఈ పాట కూడా బాగా ప్లస్ అయిందనే చెప్పొచ్చు. ఇక ఈ పాట సమంతకు భారీగా డబ్బుతో పాటు.. ఫేమ్‌ని కూడా తీసుకొచ్చిపెట్టింది. తాజాగా సమంత మరో ఐటెం సాంగ్ కి ఓకే చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి.

Supritha : ఇది మ్యాటర్.. ప్రేమపై క్లారిటీ ఇచ్చిన సురేఖ కూతురు..

పూరి జగన్నాధ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో భారీగా తెరకెక్కుతున్న సినిమా ‘లైగర్’. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో విజయ్ బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమాలో మైక్ టైసన్ ని తీసుకొచ్చి ఇప్పటికే గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు సినిమాని. అయితే మరింత గ్రాండ్ గా ప్లాన్ చేయడానికి ‘లైగర్’ సినిమాలో ఐటెం సాంగ్ కోసం సమంతని అడిగినట్లు సమాచారం. విజయ్ దేవరకొండ, సమంత స్నేహితులు అన్న సంగతి తెలిసిందే. దీంతో విజయ్ దేవరకొండ సమంతని ‘లైగర్’ సినిమాలో ఐటెం సాంగ్ చేయమని అడిగాడట. సమంత ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. ఇదే నిజమైతే కనుక సమంత తన సాంగ్ తో మరోసారి ఊపేయడం ఖాయం..