Shaakuntalam – Dhamki : వెనక్కి తగ్గిన సమంత, విశ్వక్.. శాకుంతలం, ధమ్కీ పోస్ట్‌పోన్.. కారణం అదేనా?
ఫిబ్రవరి 17న అయితే నాలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ పోరుకు సిద్ధమయ్యాయి. సమంత 'శాకుంతలం', విశ్వక్ సేన్ 'ధమ్కీ', కిరణ్ అబ్బవరం 'వినరో భాగ్యం విష్ణు కథ', తమిళ హీరో ధనుష్ 'సార్'.. సినిమాలు ఒకే డేట్ కి వస్తున్నట్లు ముందుగా ప్రకటించారు. కానీ ఇప్పుడు ఈ డేట్ నుంచి సమంత, విశ్వక్ సేన్ తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

Shaakuntalam – Dhamki : ఈ ఫిబ్రవరిలో చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాయి. ఇక ఫిబ్రవరి 17న అయితే నాలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ పోరుకు సిద్ధమయ్యాయి. సమంత ‘శాకుంతలం’, విశ్వక్ సేన్ ‘ధమ్కీ’, కిరణ్ అబ్బవరం ‘వినరో భాగ్యం విష్ణు కథ’, తమిళ హీరో ధనుష్ ‘సార్’.. సినిమాలు ఒకే డేట్ కి వస్తున్నట్లు ముందుగా ప్రకటించారు. కానీ ఇప్పుడు ఈ డేట్ నుంచి సమంత, విశ్వక్ సేన్ తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
Shaakuntalam : ‘శాకుంతలం’కి తన సంగీతంతో ప్రాణం పోస్తున్న మణిశర్మ.. ఏలేలో ఏలేలో!
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ నిర్మిస్తూ శాకుంతలం సినిమాని తెరకెక్కించాడు. దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తున్నాడు. హిందీ పురాణాలు ఆధారంగా ఈ మూవీ వస్తుండడంతో.. చాలా వరకు గ్రాఫిక్ వర్క్ జరుపుకుంది. అంతేకాదు ఈ చిత్రంలో భారీ స్టార్ క్యాస్ట్ కూడా పని చేసింది. దీంతో ఈ మూవీకి భారీ ఖర్చు అయ్యింది. ఇప్పుడు దానిని రాబట్టాలి అంటే సింగల్ రిలీజ్ డేట్ మంచిది అని మూవీ టీం భావిస్తుంది. అందుకనే చిత్ర యూనిట్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తుంది. సినిమాని పోస్ట్‌పోన్ చేస్తున్నట్లు, త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తామంటూ దిల్ రాజు అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ వార్త విన్న సమంత అభిమానులు.. ఎన్ని సార్లు పోస్ట్‌పోన్ చేస్తారు అంటూ సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు. అలా బాధ పడుతూ ట్వీట్ చేసిన ఒక అభిమానికి సమంత బదులిస్తూ.. మీ నిరీక్షణకు ఫలితం ఉంటుంది, నేను ప్రామిస్ చేస్తున్నాను అంటూ ట్వీట్ చేసింది.
అలాగే విశ్వక్ సేన్ డైరెక్ట్ చేస్తూ, నటిస్తున్న సినిమా ‘ధమ్కీ’. ఈ సినిమా పక్కా మాస్ ఎంటర్టైనర్ గా రాబోతుంది. నివేత పేతురేజ్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలోని సిజి వర్క్ ఇంకా బాలన్స్ ఉండడంతో మూవీని పోస్ట్‌పోన్ చేస్తున్నట్లు ప్రకటించాడు విశ్వక్ సేన్. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేస్తాను అని తెలియజేశాడు. కాగా ఈ సినిమా మార్చ్ సెకండ్ వీక్ లో రిలీజ్ చేయడానికి విశ్వక్ సేన్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.
The theatrical release of #Shaakuntalam stands postponed.
The new release date will be announced soon ?@Gunasekhar1 @Samanthaprabhu2 @ActorDevMohan @neelima_guna #ManiSharma @GunaaTeamworks @SVC_official @tipsofficial @tipsmusicsouth pic.twitter.com/63GIFbK4CF
— Sri Venkateswara Creations (@SVC_official) February 7, 2023
#DasKaDhamki stands postponed due to pending CG work.
The New Release Date will be announced soon ?
Eesari Theatres lo ichipadedham ?
@VishwakSenActor @Nivetha_Tweets @KumarBezwada @leon_james @VanmayeCreation @VScinemas_ @saregamasouth pic.twitter.com/zoGAS9k0yN— VishwakSen (@VishwakSenActor) February 7, 2023