Shaakuntalam : కాన్స్ ఫెస్టివల్‌లో ఏకంగా 4 అవార్డులు అందుకున్న శాకుంతలం.. ఏ కేటగిరీల్లో తెలుసా?
థియేటర్స్ వద్ద భారీ పరాజయాన్ని అందుకున్న సమంత శాకుంతలం సినిమా అవార్డులు అందుకోవడంలో మాత్రం సక్సెస్ అవుతుంది. తాజాగా ఈ చిత్రం కాన్స్ ఫిలిం ఫెస్టివల్..

samantha Shaakuntalam got 4 awards at 75th Cannes festival 2023
Shaakuntalam at Cannes 2023 : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) లీడ్ రోల్ లో నటించిన మైథలాజికల్ డ్రామా మూవీ ‘శాకుంతలం’ (Shaakuntalam). కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం కథ ఆధారంగా గుణశేఖర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ అయ్యి భారీ పరాజయాన్ని అందుకుంది. గ్రాఫిక్స్ బాగోలేదంటూ, స్టోరీ ల్యాగ్ ఉందంటూ.. నిర్మాతలకు భారీ నష్టాలనే మిగిల్చింది. ఈ మూవీ కలెక్షన్స్ అందుకోవడంలో ఫెయిల్ అయినా అవార్డులు అందుకోవడంలో మాత్రం సక్సెస్ అవుతుంది.
Kamal Haasan : కేరళ స్టోరీ పై కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు.. నిజం అనగానే నిజం అయ్యిపోదు!
ఇప్పటికే పలు అవార్డులు అందుకున్న ఈ చిత్రం.. తాజాగా ప్రఖ్యాతి కాన్స్ ఫిలిం ఫెస్టివల్ (Cannes Film Festival) లో ఈ చిత్రానికి అవార్డుల పంట పండింది. 76వ కాన్స్ ఫెస్టివల్ లో ఈ సినిమా ఏకంగా 4 అవార్డులను సొంతం చేసుకుంది. బెస్ట్ ఇండియన్ ఫిల్మ్, బెస్ట్ ఫారెన్ ఫిల్మ్, బెస్ట్ ఫాంటసీ ఫిల్మ్, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ కేటగిరీలో ఈ సినిమా అవార్డ్స్ ని అందుకుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు తమ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. థియేటర్ వద్ద ఫెయిల్ అయిన ఈ సినిమా.. ప్రశంసలు, అవార్డులు అందుకోవడంతో మూవీ టీం ఖుషీ అవుతుంది.
Rajini – Shah Rukh : కొత్త పార్లమెంట్ పై రజినీ, షారుఖ్ ట్వీట్.. రిప్లై ఇచ్చిన ప్రధాని మోదీ!
కాగా ఈ సినిమాలో సమంత శకుంతల పాత్ర, మలయాళ నటుడు దేవ్ మోహన్ దుశ్యంతుడి పాత్రలో కనిపించారు. అల్లు అర్జున్ (Allu Arjun) కూతురు అల్లు అర్హ ప్రిన్స్ భరత పాత్రలో నటించి ఆకట్టుకుంది. మోహన్ బాబు, మధూ, గౌతమి, అధితి బాలన్ మరియు అనన్య నాగళ్ల తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ ఈ సినిమాకి సంగీతం అందించాడు. గుణశేఖర్ తన నిర్మాణ సంస్థలో ఈ సినిమాని నిర్మించగా.. దిల్ రాజు ఈ చిత్రాన్ని రిలీజ్ చేశాడు. ఈ సినిమా తన లైఫ్ లో బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ అని దిల్ రాజే స్వయంగా చెప్పడం విశేషం.
View this post on Instagram