Samantha: చైతూతో డైవర్స్‌పై తొలిసారి స్పందించిన సామ్!

అక్కినేని నాగ చైతన్యతో డైవర్స్ అనంతరం సమంత సోషల్‌ మీడియాలో మరింత యాక్టివ్ గా మారింది. అంతకు ముందు యాక్టివ్ లేదని కాదు కానీ.. డైవర్స్ అనంతరం..

Samantha: చైతూతో డైవర్స్‌పై తొలిసారి స్పందించిన సామ్!

Samantha Akkineni

Samantha: అక్కినేని నాగ చైతన్యతో డైవర్స్ అనంతరం సమంత సోషల్‌ మీడియాలో మరింత యాక్టివ్ గా మారింది. అంతకు ముందు యాక్టివ్ లేదని కాదు కానీ.. డైవర్స్ అనంతరం రకరకాల అంశాలపై స్పందిస్తూ కొటేషన్లు, ఫిలాసఫీలు దంచి కొట్టింది. విహార యాత్రలు కానీ.. భావాలు కానీ.. మరేదైనా కానీ సామ్ రోజూ ఇన్ స్టాలో పోస్ట్ ఉండాల్సిందే. అయితే.. డైవర్స్ విషయంలో అదే సోషల్ మీడియాలో నెటిజన్లు సమంతాదే తప్పు అన్నట్టుగా విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి.

Shraddha Das: శ్రద్ధా ఏందబ్బా ఇది.. మరీ ఇంతగా..

అయితే సామ్ అప్పుడు ఆ ట్రోల్స్ ను ఏ మాత్రం పట్టించుకోలేదు సరికదా కనీసం స్పందించలేదు. కానీ, తాజాగా ఓ ప్రఖ్యాత మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విడాకుల గురించి.. దానిపై వచ్చిన ట్రోలింగ్ గురించి స్పందించింది. విడాకులపై ముందుగా తన మాటలతో అందరూ అంగీకరిస్తారని అనుకోవడం లేదని చెప్పేసిన సమంతా.. అందరూ తన కండిషన్స్ యాక్సెప్ట్ చేయాలని డిమాండ్ చేయనని.. ఎవరికి వారికి వారి అభిప్రాయాలు ఉండకూడదని కూడా తాను అనుకోనని.. కానీ మనం చేసే పని ఆమోదయోగ్యంగా ఉండాలని గుర్తు పెట్టుకోవాలని చెప్పింది.

Unstoppable: ఈ సాయంత్రం సూపర్ ఎంజాయ్‌మెంట్.. బాలయ్యతో మహేష్!

నిజానికి ఒకరి వ్యక్తిగత జీవితంపై మరొకరు ట్రోల్స్ తగదు. విడాకుల సమయంలో సమంతపై ట్రోల్స్ నిజంగా హద్దు మీరాయనే చెప్పాలి. సమంతా మరొకరితో రిలేషన్స్ కారణంగానే విడాకులని కొందరు బుద్ధిలేని వాళ్ళు విపరీతంగా ట్రోల్స్ చేశారు. వాటన్నిటినీ సమంతా సహనంగానే ఎదుర్కొనగా.. ఇప్పుడు ఇలా స్పందించింది. అయితే.. అసలు విడాకుల వెనుక కారణాలను మాత్రం వెల్లడించేందుకు సమంతా ఇష్టపడలేదు.