Chay Sam : మొత్తానికి సమంత నాగ చైతన్యకి బర్త్‌డే విషెష్ చెప్పలేదుగా…

గతంలో సమంత చై పుట్టిన రోజుని గ్రాండ్ గా చేసింది. సోషల్ మీడియాలో చైతుతో ఉన్న ఫోటోలు పెట్టి ఎమోషనల్ గా పోస్టులు చేసేది. కానీ విడిపోయిన తర్వాత పుట్టిన రోజు నాడు.......

Chay Sam : మొత్తానికి సమంత నాగ చైతన్యకి బర్త్‌డే విషెష్ చెప్పలేదుగా…

Sam Chay

Chay Sam :  నిన్న నవంబర్ 23న నాగ చైతన్య పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు అందరూ సోషల్ మీడియాలో జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది ప్రముఖులు చైతూకి బర్త్ డే విషెస్ తెలిపారు. అయితే చైతుకి ఎంతమంది నుంచి విషెష్ వచ్చినా ఆ ఒక్కరి నుంచి వస్తాయా? రావా? అని ఎదురు చూశారు అభిమానులు. ఆ వ్యక్తి ఎవరో మనందరికీ తెలిసిందేగా.

Pawan Kalyan : ‘భీమ్లానాయక్‌’లో పవన్ కళ్యాణ్‌తో పాట పాడిస్తా : థమన్

కొద్ది రోజుల క్రితం ఇండస్ట్రీలో బ్యూటిఫుల్ కపుల్ అంటే చైసామ్ అనే చెప్పేవారు. ఈ కపుల్ కి చాలా మంది అభిమానులు ఉన్నారు. అయితే వీరిద్దరూ నెల రోజుల క్రితం విడాకులు తీసుకున్నారు. దీంతో వీరిద్దరి కంటే కూడా అభిమానులే ఎక్కువ బాధపడ్డారు. సోషల్ మీడియాలో వీళ్ళని విడిపోవద్దని, కలిసి ఉండమని కామెంట్లు చేశారు. ఇక విడాకుల తర్వాత వారిద్దరూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు.

Manchu Vishnu : ‘మా’ సభ్యులకు ఇచ్చిన హామీలు.. ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న మంచు విష్ణు

అయితే గతంలో సమంత చై పుట్టిన రోజుని గ్రాండ్ గా చేసింది. సోషల్ మీడియాలో చైతుతో ఉన్న ఫోటోలు పెట్టి ఎమోషనల్ గా పోస్టులు చేసేది. కానీ విడిపోయిన తర్వాత పుట్టిన రోజు నాడు కనీసం నార్మల్ గా కూడా విషెష్ చెప్పకపోవడం గమనార్హం. అభిమానులు కూడా సమంత అందరిలాగే క్యాజువల్ బర్త్ డే విషెష్ పోస్ట్ పెడుతుంది అనుకున్నారు. కానీ పెట్టకపోవడంతో కొంతమంది అభిమానులు నిరాశ పడ్డారు. ఇక నెటిజన్లు దీనిపై సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇద్దరూ అనుకోని ఫ్రెండ్స్ గా ఉంటాము అనే విడిపోయారు కదా తోటి యాక్టర్ అనుకోని కనీసం బర్త్ డే విషెష్ కూడా చెప్పారా అని సమంతని ప్రశ్నిస్తుంటే కొంతమంది మాత్రం ఎందుకు చెప్పాలి అవసరం ఏముంది అని కామెంట్స్ పెడుతున్నారు. మరి సమంత రాబోయే పుట్టిన రోజున నాగ చైతన్య విషెష్ చెప్తాడేమో చూడాలి.