Special Trains : రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఆ రూట్లలో ప్రత్యేక రైళ్లు.. తేదీలు, ప్రారంభ సమయాలు ఇవే..
Special Trains : క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.
Special Trains
Special Trains : క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణీకులతో రద్దీగా ఉండే రూట్లలో ప్రత్యేక రైళ్లను నడిపించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ మేరకు ప్రత్యేక రైళ్లకు సంబంధించిన వివరాలను దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో వెల్లడించింది.
Also Read: Telangana Vision document : తెలంగాణ విజన్ డాక్యుమెంట్.. రాష్ట్రానికి 13 గేమ్ చేంజర్ ప్రాజెక్టులివే..
క్రిస్మస్, న్యూఇయర్ సందర్భంగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో నివసిస్తూ తమ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకోసం ఈ రైళ్లను నడుతుపున్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా తెలంగాణ, ఏపీ ప్రాంతాల్లోని పలు రైల్వే స్టేషన్ల మీదుగా.. ఈ నెల 24 నుంచి 31వ తేదీ వరకు ఈ ప్రత్యేక రైళ్లు పరుగులు పెట్టనున్నాయి.
ఈనెల 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు చర్లపల్లి – కాకినాడ (ట్రైన్ నం.07196) మధ్య ప్రతీ మంగళ, బుధవారాల్లో సాయంత్రం 7.30 గంటలకు, ఈ నెల 28 నుంచి 31 వరకు కాకినాడ టౌన్-చర్లపల్లి (ట్రైన్ నం.07195) మధ్య ఆది, బుధవారాల్లో సాయంత్రం 7.30 గంటలకు బయలు దేరి మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు గమ్యస్థానాలకు చేరుకుంటాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు.
ఈ ప్రత్యేక రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, రాజమండ్రి, సామల్ కోట్ స్టేషన్ల గుండా రాకపోకలు సాగిస్తాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని దక్షిణమధ్య రైల్వే అధికారులు కోరారు.
Special Trains for #Christmas and #Newyear pic.twitter.com/YmRl4C0umE
— South Central Railway (@SCRailwayIndia) December 9, 2025
