Sankranti Movies: మారిన లెక్కలు.. రెండు సినిమాలే నువ్వా నేనా!

సంక్రాంతి లెక్కలు మారుతున్నాయి. నెమ్మదిగా ఒక్కొక్కరూ సైడ్ ట్రాక్ తీసుకుంటుంటే.. గట్టిగా ఫిక్సయిన వాళ్లు మాత్రం ప్రమోషన్ స్టంట్స్ తో రెచ్చిపోతున్నారు. మరోవైపు పెద్ద పండక్కి..

Sankranti Movies: మారిన లెక్కలు.. రెండు సినిమాలే నువ్వా నేనా!

Rrr Radhe Shyam

Sankranti Movies: సంక్రాంతి లెక్కలు మారుతున్నాయి. నెమ్మదిగా ఒక్కొక్కరూ సైడ్ ట్రాక్ తీసుకుంటుంటే.. గట్టిగా ఫిక్సయిన వాళ్లు మాత్రం ప్రమోషన్ స్టంట్స్ తో రెచ్చిపోతున్నారు. మరోవైపు పెద్ద పండక్కి వచ్చేది పక్కా అని ఇన్ డైరెక్ట్ గా హింట్స్ ఇస్తున్నారు కానీ డైరెక్ట్ గా ప్రకటించట్లేదు బంగార్రాజు. పెద్ద పండక్కి మూడు సినిమాలే బరిలోకి దిగుతున్నాయి. గట్టిగా చెప్పాలంటే రెండు సినిమాలే నువ్వా నేనా అనుకోబోతున్నాయి. అవును జనవరి 7న ట్రిపుల్ ఆర్ రిలీజవుతుంటే.. జనవరి 14న రాధేశ్యామ్.. ఆ తర్వాత బంగార్రాజు వచ్చేస్తున్నారు. అంటే 7 నుంచి 14 వరకు రాబట్టాల్సిందంతా రాబట్టేసి.. 14 నుంచి బోనస్ ను క్యాచ్ చేస్తారు రాజమౌళి అండ్ టీమ్. ట్రిపుల్ ఆర్, రాధేశ్యామ్ ఇండియావైడ్ రిలీజ్ అవుతుంటే.. బంగార్రాజు తెలుగు ప్రజల్ని మాత్రమే టార్గెట్ చేయబోతున్నాడు.

కరెక్ట్ గా పండుగ రోజుల్లో వచ్చేది మాత్రం రాధేశ్యామ్, బంగార్రాజు. అయితే రాధేశ్యామ్ ఫస్ట్ నుంచి జనవరి 14నే స్టిక్ ఆన్ అయివుంటే.. ఇంతవరకు సంక్రాంతికొస్తున్నామని అధికారికంగా ప్రకటించలేదు బంగార్రాజు. కానీ పండగ లాంటి సినిమా.. బంగార్రాజు వచ్చేస్తున్నాడంటూ మాత్రం ఫ్యాన్స్ లో హైప్ క్రియేట్ చేస్తున్నారు. నిజానికి ప్రొడక్షన్ హౌజ్ జీ స్టూడియోస్ తో ఒప్పందం ప్రకారం జనవరిలోనే సినిమాను తీసుకురావాలి నాగార్జున. కానీ రాధేశ్యామ్ లెక్కలను బట్టి నిర్ణయం తీసుకునేలా ఉన్నారు. పండక్కా లేదంటే వారం గ్యాప్ తో రిలీజ్ చేద్దామా అని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

RRR: ఆర్ఆర్ఆర్ సినిమా వాయిదా ప్రచారం.. నిజమెంత?

జనవరి 12 డేట్ ప్రకటించినప్పటి నుంచి తగ్గేదే లే అంటూ నిలబడ్డారు భీమ్లా నాయక్ మేకర్స్. ఎన్నిసార్లు చర్చలు జరిగినా వచ్చేది మాత్రం పక్కా అన్నారు. ఏం చర్చలు జరిగాయో, ఎలా జరిగాయో కానీ చివరికి పండగ రేస్ నుంచి గౌరవంగా పక్కకు తప్పుకున్నారు పవన్ కల్యాణ్. అదీ ఒకందుకు మంచిదే. పెద్ద సినిమాలన్నీ ఒకేసారి రిలీజవుతే.. లాభం ఎవరికి రాకుండా పోతుంది. అందుకే ఫ్యాన్స్ కాస్త నిరాశపడినా.. భీమ్లానాయక్ ఫిబ్రవరి 25కు వెళ్లిపోయింది.

RRR: సల్మాన్‌తో కలిసి ‘నాటు’ స్టెప్పులేసిన తారక్-చరణ్!

అజిత్ వలిమై.. సంక్రాంతికే వస్తోంది. కానీ తమిళ్ తప్ప వేరే భాషల్లో రిలీజ్ కావట్లేదు. ఈ సినిమాను బోనీకపూర్ పవన్ కల్యాణ్ తో రీమేక్ చేస్తాడనే వార్తలొస్తున్నాయి. అందుకే తెలుగులో వలిమై వర్షన్ ను దింపకుండా తమిళ్ ప్రేక్షకులకు మాత్రమే పరిమితం చేస్తున్నారని అంటున్నారు. అయితే తమిళనాడులో అజిత్ సినిమా 65 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేయగా.. ట్రిపుల్ ఆర్ 45 కోట్ల బిజినెస్ చేసింది. సంక్రాంతి వరకు చరణ్, తారక్.. బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ సాధిస్తే సరి.. లేదంటే సంక్రాంతికి అజిత్ దిగితే లెక్కలు మారిపోయే ఛాన్స్ కనిపిస్తోంది.

RRR: అమెరికాలో ఆర్ఆర్ఆర్ రచ్చ.. విడుదలకు ముందే రికార్డులు!

సో మొత్తంగా చూసుకుంటే నేషనల్ వైడ్ కలెక్షన్స్ పరంగా ట్రిపుల్ ఆర్, రాధేశ్యామ్ మధ్య గట్టి పోటీ ఉండబోతుంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వీరిద్దరికీ తోడు అక్కినేని హీరోలు పందెం కడుతున్నారు. ఎక్కడ, ఏ మాత్రం తేడా కొట్టకుండా జక్కన ప్రమోషన్ స్పీడ్ ఫుల్ గా పెంచేశాడు. తారక్, చరణ్ లను వెంటపెట్టుకుని సౌత్, నార్త్ సిటీలన్నీ తిరిగేస్తున్నాడు. సల్మాన్ వంటి స్టార్స్ సపోర్ట్ తో బాలీవుడ్ లో ఇప్పటికే ఫుల్ బజ్ క్రియేట్ చేశాడు. తెలుగు ప్రజల ముందుకు చిరూ, బాలకృష్ణను కలిపి తీసుకొచ్చేలాంటి క్రేజీ ప్లాన్స్ చేస్తున్నాడు. ఇలా ఇప్పటికే సూపర్ హైప్ తీసుకొచ్చి యూఎస్ లో అడ్వాన్స్ బుకింగ్ అదిరేలా చేశారు ట్రిపుల్ ఆర్ టీమ్.

Radhe Shyam: ఫైట్స్, ఛేజింగ్స్ ఉండవు.. ముందే ప్రిపేర్ చేసిన డైరెక్టర్!

మొన్నటివరకు లిరికల్ సాంగ్స్ తోనే పలకరించిన ప్రభాస్.. రాధేశ్యామ్ కోసం రీసెంట్ గానే ప్రీ రిలీజ్ ఫంక్షన్ కొచ్చాడు. ట్రైలర్ ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేసినా ఎందుకో పెద్దగా ఎక్స్ పెక్టేషన్స్ పెంచే పని పెట్టుకోలేదు రాదేశ్యామ్ టీమ్. సడెన్ సర్ప్రైజ్ లు ఇచ్చి కలెక్షన్స్ బూస్టప్ చూడాలనుకుంటుందనేది ఇండస్ట్రీ టాక్. ప్రస్తుతానికి పాటలు, ట్రైలర్, ప్రభాస్ కటౌట్ మాత్రమే రాధేశ్యామ్ ప్రచారాస్త్రాలు. అయినా సరే మోస్ట్ అవైటైడ్ మూవీగా దూసుకుపోతుంది గ్లోబర్ స్టార్ సినిమా.

Radhe Shyam: ప్రభాస్ అభిమానులకు కిక్కిచ్చిన పాన్ ఇండియా డైరెక్టర్స్!

ఇదంతా నాణేనికి ఒక వైపే. దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసుల కారణంగా ఎప్పుడేం జరిగినా ఆశ్చర్యం లేదు. కొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూలు మొదలయ్యాయి. బెంగళూరు లాంటి నగరాల్లో డిసెంబర్ 31, జనవరి1వ తేదీల్లో ఆంక్షలుపెట్టారు. మరోసారి లాక్ డౌన్ అన్న భయాలు ఊపందుకున్నాయి. ఇప్పటికీ ఉత్తరాదిన చాలా ప్రాంతాల్లో 50 శాతం ఆక్యుపెన్సీతోనే థియేటర్స్ నడిచే పరిస్థితి ఉంది. అటు ఓవర్సీస్ లోనూ అదే పరిస్థితి. అమెరికా లాంటి దేశాల్లో ఆంక్షలనే మాటలు వినిపిస్తున్నాయి. ఇక టికెట్స్ విషయంలో ఆంధ్రప్రదేశ్ సిచ్యుయేషన్ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఇన్ని భయాలు ఇలా ఉన్నా.. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ సినిమా మేకర్స్ ధైర్యం చేస్తుండటం ఫ్యాన్స్ లో ఉత్సహాన్ని నింపుతోంది.