OTT Release: సంక్రాంతి టార్గెట్.. ఈ వారం నుండే ఓటీటీలో పండగ!

సంక్రాంతి సీజన్ ను గట్టిగానే వాడాలని డిసడయ్యాయి ఓటీటీలు. కొత్త సినిమాలను జనవరి ఫస్ట్ వీక్ నుంచే క్యూలో పెట్టేశాయి. తెలుగులో అయితే ఒక్కరోజే నాగశౌర్య రెండు కొత్త సినిమాలు ఒకేసారి..

OTT Release: సంక్రాంతి టార్గెట్.. ఈ వారం నుండే ఓటీటీలో పండగ!

Ott Release

OTT Release: సంక్రాంతి సీజన్ ను గట్టిగానే వాడాలని డిసడయ్యాయి ఓటీటీలు. కొత్త సినిమాలను జనవరి ఫస్ట్ వీక్ నుంచే క్యూలో పెట్టేశాయి. తెలుగులో అయితే ఒక్కరోజే నాగశౌర్య రెండు కొత్త సినిమాలు ఒకేసారి ఓటీటీ ఎంట్రీ ఇచ్చేస్తున్నాయి. జనవరి 7.. 2022 మొదటి శుక్రవారాన్ని టార్గెట్ చేశాడు నాగశౌర్య. ఒకే రోజు రెండు సినిమాలతో ఓటీటీ ఎంట్రీ ఇచ్చేస్తున్నాడు. ఆహాపురంలో ఈ వారం ఆటగా నాగశౌర్య లక్ష్య స్ట్రీమింగ్ కాబోతుంది. ప్రతి శుక్రవారం ఇకపై సందడే సందడంటూ చెప్పిన ఆహా.. ఈ ఫ్రైడే.. లేటెస్ట్ లక్ష్యను దింపుతోంది. ఆర్చరీ బ్యాక్ డ్రాప్ లో జరిగే స్పోర్ట్స్ డ్రామాగా సంతోశ్ జాగర్లమూడి ఈ సినిమాను తెరకెక్కించాడు. గతేడాది ఏంట్రీ ఇచ్చిన హాట్ గర్ల్ కేతికాశర్మ ఇందులో హీరోయిన్.

Radhe Shyam: రాధేశ్యామ్‌కి ఓటీటీ ఆఫర్.. రూ.400 కోట్లకు పైగా డీల్!

జీ5 ఓటీటీలో నాగశౌర్య వరుడు కావలెను జనవరి 7 నుంచి స్ట్రీమింగ్ కి రెడీఅయింది. రీతూవర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా పాటలు ఆమధ్య బాగానే సందడి చేసింది. లేడీ డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా ఈ సినిమాకు కాస్త వర్క్ చేశారు. నదియా, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ వంటి యాక్టర్స్ నటించారిందులో. ఫ్యామిలీడ్రామాను ఎలివేట్ చేసిన ఈ సినిమా ఓటీటీ ఫ్యామిలీ ఆడియెన్స్ బాగానే అట్రాక్ట్ చేసే ఛాన్స్ ఉంది.

Sankranti Release: సీన్ రివర్స్.. పెద్ద పండగకి చిన్న సినిమాల హడావుడి!

హాట్ స్టార్ ఈ వీక్ చాలా సినిమాలనే లైనప్ చేసింది. ముందుగా ‘9-1-1 లోన్ స్టార్’ సీజన్ 3 స్ట్రీమింగ్ కాబోతుంది. యాక్షన్ అడ్వెంచరస్ క్రైమ్ డ్రామాగా హాట్ స్టార్ దీనిని ప్రమోట్ చేస్తోంది. అబ్బోట్ ఎలిమెంటరీ, దిస్ ఈజ్ యూఎస్ సీజన్ 6 ప్రాజెక్ట్స్ తో పాటూ ఈ వారం తమిళ్ ఫిల్మ్ అన్బరివూ రిలీజ్ కాబోతుంది. జనవరి 7 నుంచి అమెజాన్ ప్రైమ్.. ది టెండర్ డ్రామాను ప్లే చేస్తోంది. ఎంఎక్స్ ప్లేయర్ లో క్యాంపస్ డైరీస్.. సోనీ లివ్ లో క్యూబికల్స్ సీజన్ 2.. హోయ్ చోయ్ లో మిస్టరీ గోరా వంటి సినిమాలు రాబోతున్నాయి.

Siri-Shanmukh: బాధలో దీప్తి.. జెస్సీ, సిరితో షన్ను ఎంజాయ్‌మెంట్!

ఆహా.. అన్ స్టాపబుల్ అంటూ దూసుకుపోతున్న బాలయ్య.. ఈ వారం కూడా ఫుల్ ఎనర్జీని చూపించబోతున్నారు. రానాను గెస్ట్ గా తీసుకొచ్చి హల్చల్ చేయబోతున్నారు. రీసెంట్ గా రిలీజైన ప్రోమో చూస్తుంటే రానాతో బాలయ్య అద్దరగొట్టినట్టు తెలుస్తోంది. జనవరి 7న రాత్రి 8 గంటలకు ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ స్టార్ చేయబోతుంది ఆహా.