Mahesh Babu : రెండొందల కోట్ల క్లబ్‌లో సర్కారు వారి పాట.. కొనసాగుతున్న మహేష్ మానియా.. | Sarkaru vaari paata enter in to 200 crores club

Mahesh Babu : రెండొందల కోట్ల క్లబ్‌లో సర్కారు వారి పాట.. కొనసాగుతున్న మహేష్ మానియా..

తాజాగా ఈ సినిమా 12 రోజులకు గాను 200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఒక రీజనల్ సినిమాగా రిలీజ్ అయి సర్కారు వారి పాట 200 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టి............

Mahesh Babu : రెండొందల కోట్ల క్లబ్‌లో సర్కారు వారి పాట.. కొనసాగుతున్న మహేష్ మానియా..

Mahesh Babu :   సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారు వారి పాట సినిమా మే 12న థియేటర్లలో రిలీజ్ అయి మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకెళ్లి మంచి విజయం సాధించింది. మెల్లి మెల్లిగా మౌత్ టాక్ తో సినిమా ప్రమోట్ అయి రోజురోజుకి మరింత హిట్ గా నిలిచి భారీ విజయం సాధించింది. పరశురామ్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది.

ఒక రీజనల్ సినిమాగా రిలీజ్ అయి సర్కారు వారి పాట సినిమా వసూళ్ల సునామి కురిపిస్తుంది. సినిమా రిలీజ్ అయిన మూడు రోజులకే 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి సరికొత్త రికార్డు సాధించింది. ఇక అమెరికాలో ఇప్పటికే 2 మిలియన్ డాలర్లు పైగా వసూలు చేసి అక్కడ కూడా కలెక్షన్లు వసూలు చేస్తుంది. తాజాగా ఈ సినిమా 12 రోజులకు గాను 200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఒక రీజనల్ సినిమాగా రిలీజ్ అయి సర్కారు వారి పాట 200 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టి సరికొత్త రికార్డు సృష్టించింది.

Kiara Advani : పెళ్లి చేసుకోకుండా కూడా లైఫ్‌లో సెటిల్ అవ్వొచ్చు.. డబ్బులు సంపాదిస్తే చాలు..

 

ఒక రీజనల్ సినిమాతోనే మహేష్ ఈ రేంజ్ లో కలెక్షన్స్ సాధిస్తే ఇక పాన్ ఇండియా సినిమా అయితే బాక్సాఫీస్ దద్దరిల్లిపోతుంది అంటున్నారు ఫ్యాన్స్. మరో మూడు రోజుల వరకు వేరే సినిమాలు రిలీజ్ ఏమి లేకపోవడంతో ఇంకో 50 కోట్లు ఈజీగా కొల్లగొట్టేస్తుంది అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. మొత్తానికి మరోసారి మహేష్ తనలోని మాస్, వింటేజ్ ని చూపించి వసూళ్లు కురిపించాడు. ఈ విషయంలో మహేష్ అభిమానులు ఫుల్ ఖుషిగా ఉన్నారు.

×