Sarkaru Vaari Paata: రొమాంటిక్ వైబ్స్ క్రియేట్ చేస్తున్న కళావతి.. పక్కా డ్యూయెట్టేనా?

మహేశ్ బాబు సర్కారు వారి పాట నుంచి కళావతి సాంగ్ వాలెంటైన్స్ డే స్పెషల్ గా రిలీజ్ కానుంది. లేటెస్ట్ గా ఆ సాంగ్ లో నుంచి ఒక స్టిల్ రిలీజ్ అయ్యింది. ఆ ఫోటో చూసిన మహేశ్ ఫాన్స్ కు..

Sarkaru Vaari Paata: రొమాంటిక్ వైబ్స్ క్రియేట్ చేస్తున్న కళావతి.. పక్కా డ్యూయెట్టేనా?

Sarkaru Vaari Paata

Sarkaru Vaari Paata: మహేశ్ బాబు సర్కారు వారి పాట నుంచి కళావతి సాంగ్ వాలెంటైన్స్ డే స్పెషల్ గా రిలీజ్ కానుంది. లేటెస్ట్ గా ఆ సాంగ్ లో నుంచి ఒక స్టిల్ రిలీజ్ అయ్యింది. ఆ ఫోటో చూసిన మహేశ్ ఫాన్స్ కు గతంలో మహేశ్ బాబు చేసిన సినిమాలన్నీ గుర్తొస్తాయి. ప్రిన్స్ డ్యూయట్ సాంగ్ విజువల్స్ ఇమాజినేషన్ లో కనిపిస్తాయి. క్యాజువల్ గానే మహేశ్ బాబు సినిమాల్లో హీరో హీరోయిన్స్ మధ్య మంచి కెమిస్ట్రీ ఉంటుంది. డ్యూయట్ సాంగ్స్ మెమరబుల్ గా ఉంటాయి. ఇప్పడొస్తున్న కళావతి సాంగ్ కూడా మహేశ్ ఫాన్స్ లో ఆ హోప్ క్రియేట్ చేస్తుంది.

Chiranjeevi: చిరు లైనప్.. సినిమాకో హీరోకి అవకాశమిస్తున్న మెగాస్టార్!

ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే సందర్బంగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తున్నామంటూ అనౌన్స్ చేసింది సర్కారు వారి పాట టీమ్. దాంతో ఫాన్స్ బిజెనెస్ మాన్ లో కాజల్ తో చేసిన ఐ లవ్ యూ అంటే ఛీ కొట్టి పోతావ్ సాంగ్ లా ఉంటుందా, దూకుడులో సమంతతో చేసిన ఇటు రాయే ఇటు రాయే పాటలా ఆకట్టుకుంటుందా, అంటూ మహేశ్ బాబు పాత సినిమాల డ్యూయట్ సాంగ్స్ అన్నీ గుర్తు చేసుకున్నారు. హీరో హీరోయిన్స్ మధ్య లవ్ డ్యూయట్ సాంగ్ ఎక్స్ పెక్ట్ చేశారు.

Payal Ghosh: బాలీవుడ్‌ను టాలీవుడ్ ఓవర్ టేక్ చేస్తుందని నేనెప్పుడో చెప్పా.. నటి ట్వీట్ వైరల్!

ఫాన్స్ ఎక్స్పెక్టేషన్స్ కు తగ్గట్టే కీర్తి సురేష్ కాంబినేషన్ లో కళావతి సాంగ్ పోస్ట్రర్ రిలీజ్ చేసి, ఆ తర్వాత చిన్న టీజర్ ఒకటి రిలీజ్ చేసి ఫాన్స్ లో రొమాంటిక్ వైబ్స్ క్రియేట్ చేశారు సర్కార్ వారి పాట టీమ్. గతంలో మహేశ్ బాబు చేసిన సినిమాలు అందులోని డ్యూయట్స్ గుర్తు చేసుకుని పాడుకుంటున్నారు ఫాన్స్. పోకిరిలో ఇలియానా పోస్టర్ కు ఇప్పుడు రిలీజ్ అయిన కళావతి పోస్టర్ కు ఏమాత్రం డిఫరెన్స్ లేదు. దాంతో పోకిరి సినిమాతో కంపేర్ చేస్తూ ఆ సినిమా రేంజ్ లో సర్కార్ వారి పాట ఇండస్ట్రీ హిట్ అందుకుంటుందేమో అని అంచనాలేసుకుంటున్నారు. ఆ సినిమాలోని గలగల పారుతున్న గోదారిలా పాటను ఇమాజినేషన్ లో పాడేసుకుంటున్నారు.

RGV: మెగా సూపర్ డూపర్ ఓమెగా స్టార్ జగన్.. ఆగని ఆర్జీవీ ట్వీట్ల పర్వం!

సినిమా కన్నా ముందు ఆడియన్స్ కి రీచ్ అయ్యేది మ్యూజిక్. మ్యూజిక్ తో ఓ హైప్ క్రియేట్ చేసినప్పుడు సినిమా మీద కూడా ఆడియన్స లో ఇంట్రస్ట్ పీక్స్ కి వెళుతుంది. అందుకే సినిమాతో పాటు మ్యూజిక్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మ్యూజిక్ డైరెక్టర్లు. సర్కార్ వారి పాట సాంగ్స్ కూడా ఓ రేంజ్ లో ఇవ్వడానికే చూస్తున్నాడు. గతంలో మహేశ్ బాబు, తమన్ కాంబినేషన్ లో వచ్చిన బిజినెస్ మాన్, దూకుడు సినిమాల రేంజ్ కి తగ్గకుండా సర్కార్ వారి పాట మ్యూజిక్ ఆల్బమ్ హిట్ చేస్తాడాని లెక్కలేసుకుంటున్నారు మహేశ్ బాబు ఫాన్స్.