ఫిబ్రవరి 8న శివ, సమంతల సీమరాజా

శివకార్తికేయన్, సమంత జంటగా కోలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన సీమరాజా ఫిబ్రవరి 8న తెలుగులో రిలీజ్ కానుంది.

  • Published By: sekhar ,Published On : January 29, 2019 / 12:28 PM IST
ఫిబ్రవరి 8న శివ, సమంతల సీమరాజా

శివకార్తికేయన్, సమంత జంటగా కోలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన సీమరాజా ఫిబ్రవరి 8న తెలుగులో రిలీజ్ కానుంది.

వరస విజయాలతో తమిళనాట సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న యంగ్ హీరో శివకార్తికేయన్, సమంత జంటగా కోలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన సినిమా, సీమరాజా. ఈ సినిమా తెలుగులో రిలీజవనుంది. ఆర్.డి.రాజా నిర్మాణంలో, పొన్రమ్ డైరెక్షన్‌లో వచ్చిన సీమరాజా, తమిళనాట బి.సి.సెంటర్స్‌లో విపరీతంగ ఆడింది. రెండు ఊళ్ళ మధ్య జరిగే పక్కా కయర్షియల్ సినిమా ఇది. గతంలో శివకార్తికేయన్ నటించిన రెమో తెలుగులో రిలీజ్ అయ్యింది. పెద్దతెరలపై యావరేజ్‌గా ఆడినా, బుల్లితెరపై మాత్రం బాగా క్లిక్ అయ్యింది. ఇప్పుడు సీమరాజాగా తెలుగు ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు శివకార్తికేయన్. సాయికృష్ణ ఫిలింస్ వారు సీమరాజాని తెలుగులో డబ్ చేసారు. ఫిబ్రవరి 8న రిలీజ్ చెయ్యబోతున్నారు.

ఒకప్పటి ఫేమస్ హీరోయిన్ సిమ్రన్ ఈ సినిమాలో నెగెటివ్ రోల్‌లో నటించింది. కీర్తి సురేష్ అతిథి పాత్రలో అలరిస్తుంది. శివకార్తికేయన్, సమంతల కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. లాల్, నెపోలియన్, సూరి తదితరులు నటించిన ఈ మూవీకి సంగీతం : డి.ఇమాన్, కెమెరా : బాలసుబ్రమణియన్, ఎడిటింగ్ : వివేక్ హర్షన్, స్టంట్స్ : అనల్ అరసు, కొరియోగ్రఫీ : దినేష్, శోభి, బాబా భాస్కర్.

వాచ్ సీమరాజా ట్రైలర్…