R. Narayana Murthy : ఓటీటీ రిలీజ్‌లపై ‘పీపుల్స్ స్టార్’ సెన్సేషనల్ కామెంట్స్..

‘సేవ్ థియేటర్స్.. సేవ్ ఫిల్మ్స్’ అనే నినాదంతో ఓటీటీ రిలీజ్‌లు ఆపాలంటూ సినీ పెద్దలకు విజ్ఞప్తి చేశారు నారాయణ మూర్తి..

R. Narayana Murthy : ఓటీటీ రిలీజ్‌లపై ‘పీపుల్స్ స్టార్’ సెన్సేషనల్ కామెంట్స్..

R Narayana Murthy

R. Narayana Murthy: తన సినిమాలతో బడుగు, బలహీన వర్గాల వారిలో చైతన్యం తీసుకొస్తుంటారు ‘పీపుల్స్ స్టార్’, దర్శకుడు ఆర్. నారాయణ మూర్తి ఏ విషయం అయినా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడతారు. ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లు ఇంకా పున:ప్రారంభించకపోవడం, ఓటీటీ వ్యవస్థ సామాన్యులకు అందుబాటులో లేకపోవడం వంటి అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేశారాయన. ‘సేవ్ థియేటర్స్.. సేవ్ ఫిల్మ్స్’ అనే నినాదంతో ఓటీటీ రిలీజ్‌లు ఆపాలంటూ సినీ పెద్దలకు విజ్ఞప్తి చేశారు నారాయణ మూర్తి.

R Narayana Murthy

 

ఆయన మాట్లాడుతూ.. ‘‘ఆనాటి తోలుబొమ్మలాట, నాటకాల నుండి సినిమాల వరకు వచ్చాం. ఈరోజుల్లో సోషల్ మీడియా కూడా బాగా వ్యాప్తి చెందింది. యూట్యూబ్‌లో అన్నీ చూస్తున్నాం. అలాగే ఓటీటీల్లో సినిమాలు చూసేస్తున్నాం. థియేటర్లో కూర్చుని సినిమా చూడ్డానికి ఇంట్లో చూడ్డానికి చాలా తేడా ఉంది. ఓటీటీ వల్ల థియేటర్ వ్యవస్థకు పెద్ద నష్టం.
టెక్నాలజీ డెవలప్‌మెంట్ ఒప్పుకోవలసిందే కానీ మహానుభావుడు అమర్త్య సేన్ అన్నట్టు సాంకేతిక విప్లవం అనేది అట్టడుగు వర్గాలకు అందని నాడు వేస్టే కదా.. అలాంటప్పుడు ఓటీటీ కూడా అంతే కదా.. ఏ ఒక్కచోట రిలీజ్ చేస్తే సినిమా బాగుంది అంటేనే సినిమా కొంటారు లేకపోతే సినిమా కొనరు.

సినిమా థియేటర్ల యజమానులుధరల పెంపుదల విషయంలో తాత్కాలిక జీఓను పెట్టుకొని ఎంతకాలం ఉంచుతారు. ధరలు పెంచాలని ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేస్తున్నాను. ఈ కరోనా కష్ట కాలంలో తెలుగు ఇండస్ట్రీలో 20 శాతం మంది ఎక్కువ బడ్జెట్‌తో సినిమా తీసినవాళ్లు, పబ్లిసిటీ చేసుకున్న వాళ్లు తమ సినిమాలను ఓటీటీలకు అమ్మేసుకున్నారు. ఓటీటీ ద్వారా కేవలం 20 శాతం మంది మాత్రమే సినిమా చుస్తారు. మిగిలిన 80 శాతం సగటు ప్రేక్షకులు సినిమా థియేటర్లకు వెళ్లి చూస్తారు. బడుగు బలహీన వర్గాలు, సామాన్యులు సినిమాలు చూడకూడదా..? ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు సహకరించి ఆంధ్రప్రదేశ్‌లో కూడా సినిమా థియేటర్లు తెరుచుకునేలా చర్యలు తీసుకోవాలి’’.. అన్నారు.

R Narayana Murthy