Tollywood : తెలుగులో రాబోతున్న సీక్వెల్స్, పార్ట్ 2 చిత్రాలు ఇవే..

తెలుగులో మరిన్ని సినిమాలు రెండు భాగాలు లేదా అంతకంటే ఎక్కువ పార్ట్స్ గా ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. మరి ఆ చిత్రాలు ఏంటో ఒకసారి మీరుకూడా చూసేయండి.

Tollywood : తెలుగులో రాబోతున్న సీక్వెల్స్, పార్ట్ 2 చిత్రాలు ఇవే..

Sequels and Multiple parts of tollywood movies details

Updated On : October 4, 2023 / 9:23 PM IST

Tollywood : బాహుబలి సినిమాతో మొదలైన రెండు భాగాల ట్రెండ్ కొనసాగుతూ ముందుకు వెళ్తుంది. మూడు గంటల్లో కూడా చెప్పలేని కథలను రెండు భాగాలుగా రూపొందిస్తు ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్నారు మేకర్స్. బాహుబలి తరువాత కేజీఎఫ్, పొన్నియిన్ సెల్వన్ చిత్రాలు ఆడియన్స్ ముందుకు వచ్చాయి. వీటి తరువాత పుష్ప, పెద్దకపు, బ్రహ్మాస్త్ర, మా ఊరి పొలిమేర సినిమాలు కూడా ముల్టీపుల్ పార్ట్స్ తెరకెక్కగా.. ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ ఆడియన్స్ ముందుకు వచ్చేశాయి. కొనసాగింపు భాగాలు చిత్రీకరణ జరుపుకుంటున్నాయి.

ఇక ఇవి కాకుండా తెలుగులో మరిన్ని సినిమాలు రెండు భాగాలు లేదా అంతకంటే ఎక్కువ పార్ట్స్ గా ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. మరి ఆ చిత్రాలు ఏంటో ఒకసారి మీరుకూడా చూసేయండి. ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాని ఒక భాగంగా స్టార్ట్ చేసిన మేకర్స్ ఇప్పుడు రెండు పార్ట్స్ గా తీసుకు వస్తున్నామంటూ ప్రకటించారు. ఫస్ట్ పార్ట్ ని వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నారు. ఇక ప్రభాస్ ‘సలార్’ని కూడా రెండు భాగాలుగా తీసుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 22న ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్నారు.

Also Read : Singer Mangli : బావతో మంగ్లీ పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన సింగర్.. మా బావతో పెళ్లి..!

అలాగే ప్రభాస్ ‘కల్కి 2898 AD’ సినిమా కూడా ముల్టీపుల్ పార్ట్స్ గా తెరకెక్కుతుందట. రెండు భాగాలు కంటే ఎక్కువ ఉండచ్చని సమాచారం. రాజమౌళి, మహేష్ బాబు SSMB29, పవన్ కళ్యాణ్ OG కూడా రెండు భాగాలుగా వస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. హిట్ 3, గూఢచారి 2 సినిమాలు ఆఆ సినిమాటిక్ సిరీస్ లో భాగంగా తెరకెక్కుతున్నాయి. ఇక భాగాలుగా కాకుండా సీక్వెల్స్ రూపంలో కూడా కొన్ని సినిమా రాబోతున్నాయి.

బోయపాటి తెరకెక్కించిన అఖండ, స్కంద సినిమాలకు సీక్వెల్స్ ఉంటాయి అంటూ ఇప్పటికే అధికారికంగా ప్రకటించేశారు. ఫ్యూచర్ లో ఇవి ఆడియన్స్ ముందుకు రానున్నాయి. ఇక సిద్దు జొన్నలగడ్డ నటించిన డీజే టిల్లుకి కూడా సీక్వెల్ వస్తుంది. ‘టిల్లు స్క్వేర్’గా తెరకెక్కుతున్న ఈ మూవీ ఈ ఏడాది రిలీజ్ కానుంది. వీటితో పాటు విరూపాక్ష, హరిహరవీరమల్లు, విజయ్ దేవరకొండ VD12 సినిమాల విషయంలో కూడా ఇదే టాక్ వినిపిస్తుంది. మరి భవిషత్తులో ఇంకెన్ని వస్తాయో చూడాలి.