Shaakuntalam: శాకుంతలం రెస్పాన్స్ మామూలుగా లేదుగా..?

స్టార్ బ్యూటీ సమంత నటించిన ‘శాకుంతలం’ను ఓటీటీలో ప్రేక్షకులు చూసేందుకు ఆసక్తిగా ఉండటంతో ఈ చిత్రానికి అనుకోని రెస్పాన్స్ దక్కింది.

Shaakuntalam: శాకుంతలం రెస్పాన్స్ మామూలుగా లేదుగా..?

Shaakuntalam: స్టార్ బ్యూటీ సమంత నటించిన లేటెస్ట్ మూవీ ‘శాకుంతలం’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రెస్పాన్స్ దక్కించుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు గుణశేఖర్ డైరెక్ట్ చేయగా, పూర్తి మైథలాజికల్ మూవీగా వచ్చిన ‘శాకుంతలం’ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయ్యింది.

Shaakuntalam : నాగచైతన్య ఫ్యాన్స్ వల్లే శాకుంతలం ప్లాప్.. బిగ్‌బాస్ నటి వ్యాఖ్యలు!

ఇక ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్న చిత్ర యూనిట్, తీవ్ర నిరాశకు లోనయ్యారు. కాగా, ఈ సినిమాపై సమంత కూడా భారీ అంచనాలు పెట్టుకుంది. కానీ, ప్రేక్షకులు ఇచ్చని తీర్పుతో చిత్ర యూనిట్ సైలెంట్ అయ్యారు. అటు ఈ సినిమాను చెప్పిన డేట్‌కంటే ముందే, ఓటీటీలో స్ట్రీమింగ్ చేశారు ఓటీటీ ప్లాట్‌ఫాం నిర్వాహకులు. అక్కడయినా ఈ సినిమాకు బెటర్ రిజల్ట్ వస్తుందని భావించారు.

Shaakuntalam: వైరల్ అవుతోన్న శాకుంతలం ఓటీటీ న్యూస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కానీ, ఓటీటీలోనూ ప్రేక్షకులు శాకుంతలం సినిమాను చూసేందుకు ఆసక్తిగా ఉండటంతో ఈ చిత్రానికి అనుకోని రెస్పాన్స్ దక్కింది. ఈ మూవీకి ట్రెమెండస్ రెస్పాన్స్ దక్కినట్లుగా చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇలా థియేటర్లలో కాకపోయినా, ఓటీటీలో తాము అనుకున్న స్థాయికంటే ఎక్కువ రెస్పాన్స్‌ను తెచ్చినందుకు శాకుంతలం మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.