షారూఖ్ ఖాన్ 55బర్త్ డే.. ఫ్యాన్స్‌కు బాద్ షా రిక్వెస్ట్

షారూఖ్ ఖాన్ 55బర్త్ డే.. ఫ్యాన్స్‌కు బాద్ షా రిక్వెస్ట్

Shah Rukh Khan: బాలీవుడ్ బాద్ షా 55వ బర్త్ డే జరుపుకోవడానికి రెడీ అయ్యాడు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని COVID-19 సేఫ్టీకి సంబంధించిన రిక్వెస్ట్ చేశాడు. ఏటా షారూఖ్ ఖాన్ బర్త్ డే సందర్భంగా అభిమానులు హీరో బంగ్లా (మన్నత్)కు వచ్చి మరీ విషెస్ చెబుతుంటారు.

ఫ్యాన్స్ హెల్త్ రిస్క్ లో పడకూడదని.. షారూఖ్ అభిమానులను ‘ఇస్ బార్ కా ప్యార్.. థోడా దూర్ సే యార్’ (ఈ సారి మీ ప్రేమను కాస్త దూరంగా ఉంటూనే సెలబ్రేట్ చేసుకుందాం) అని ట్వీట్ చేశాడు.



ఓ అభిమాని బర్త్ డే ప్లాన్స్ ఏంటని అడిగిన ప్రశ్నకు షారూఖ్ ఇలా బదులిచ్చాడు. ‘గుంపులుగా పోగవద్దని కోరుతున్నా. నా బర్త్ డే అయినా వేరేదైనా. ఈ సారి ప్రేమ.. కాస్త దూరంగా అని ట్వీట్ చేశాడు.

కొన్నేళ్లుగా షారూఖ్ బర్త్ డేకు అతనితో పాటు కొడుకు అబ్‌రామ్‌తో కలిసి కనిపించేవాడు.