Shah Rukh Khan : పఠాన్ సక్సెస్.. కొత్త కారుతో ముంబైలో షికార్లు కొట్టిన షారుఖ్.. కారు ధర తెలిస్తే షాక్!
షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) పఠాన్ (Pathaan) సక్సెస్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ ఆనందంతోనే ఒక కొత్త కారుని కొనుగోలు చేశాడు. ఆ కారుని వేసుకొని ముంబై రోడ్ల పై షికార్లు కొడుతూ సందడి చేశాడు.

Shah Rukh Khan purchase Rolls Royce car details
Shah Rukh Khan : బాలీవుడ్ కి పూర్వ వైభవం తీసుకు రావడానికి ఖాన్స్ అంతా ఇబ్బందులు పడుతున్న సమయంలో షారుఖ్ (Shah Rukh Khan) పఠాన్ (Pathaan) సినిమాతో ఏకంగా 1000 కోట్ల కలెక్షన్స్ సాధించి.. తానే నిజమైన కింగ్ ఖాన్ అనిపించుకున్నాడు. చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమా తరువాత నుంచి దాదాపు 4 ఏళ్ళ పాటు షారుఖ్ ఖాన్ కి కూడా ఒక్క హిట్టు లేదు. ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్నట్లు.. పఠాన్ సినిమాతో తాను కమ్‌బ్యాక్ ఇవ్వడమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీని కూడా కొంతమెర ఆదుకున్నాడు. ఇక ఈ మూవీ ఇచ్చిన సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు.
Shah Rukh Khan : ఇది బిజినెస్ కాదు, పర్సనల్.. పఠాన్ పై షారుఖ్ ఎమోషనల్ ట్వీట్!
ఈ ఆనందంతోనే ఒక కొత్త కారుని కొనుగోలు చేశాడు. ఆ కారుని వేసుకొని ముంబై రోడ్ల పై షికార్లు కొడుతూ సందడి చేశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే నెటిజెన్లు అంతా ఆ కారు ఏమి కంపెనీ, దాని ధర ఎంత ఉండవచ్చు అని తెలుసుకోడానికి ట్రై చేస్తున్నారు. కారు పేరు వచ్చేసరికి.. రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన క్యులినన్ బ్లాక్ బెడ్జ్ మోడల్. ఇండియన్ ఖర్చు ప్రకారం దీని ధర దాదాపు 10 ఉండవచ్చు. కాగా ఇటీవల 5 కోట్ల విలువ చేసే చేతి వాచ్ ధరించి కూడా షారుఖ్ కనిపించి వార్తల్లో నిలిచాడు. చూస్తుంటే పఠాన్ సక్సెస్ ని షారుఖ్ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు.
SRK Jawan: షారుక్ ‘జవాన్’లో అల్లు అర్జున్ ప్లేస్‌లో ఆ హీరో..?
ఇక తన సినిమాలు విషయానికి వస్తే, ప్రస్తుతం జవాన్ (Jawan), డుంకీ (Dunki) సినిమాల్లో నటిస్తున్నాడు. వీటితో పాటు సల్మాన్ ఖాన్ టైగర్ 3 లో గెస్ట్ రోల్ చేస్తున్నాడు. డుంకీ షూటింగ్ పూర్తి అయ్యి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. జవాన్ ఇంకా చిత్రీకరణ దశలోనే ఉంది. తమిళ దర్శకుడు అట్లీ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా, విజయ్ సేతుపతి విలన్ గా చేస్తున్నట్లు తెలుస్తుంది.
#ShahRukhKhan𓀠 new car Rolls-Royce 555 entrying in #Mannat last night 🌙 @iamsrk pic.twitter.com/tU1GWgkC9T
— SRK Khammam Fan club (@srkkhammamfc) March 27, 2023