Shah Rukh Khan: మమ్మల్ని రాక్షసులిగా చూపించారు – షారుఖ్

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కుటుంబం గతకొంత కాలంగా తీవ్ర కష్టాలను ఎదుర్కొంటుంది. గత అక్టోబర్ నెలలో షారుఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్ ముంబై....

Shah Rukh Khan: మమ్మల్ని రాక్షసులిగా చూపించారు – షారుఖ్

Shah Rukh Khan Says His Family Was Painted As Monsters

Shah Rukh Khan: బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కుటుంబం గతకొంత కాలంగా తీవ్ర కష్టాలను ఎదుర్కొంటుంది. గత అక్టోబర్ నెలలో షారుఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్ ముంబై సముద్రంలో ఓ క్రూయిజ్ షిప్‌లో జరుగుతున్న పార్టీలో పాల్గొన్నాడు. అయితే ఈ పార్టీలో డ్రగ్స్ వినియోగించారనే సమాచారంతో ఎన్సీబీ అధికారులు ఆ షిప్‌పై దాడి చేసి, అందులో ఉన్నవారిని అరెస్ట్ చేశారు. అయితే ఆర్యన్ ఖాన్ కూడా డ్రగ్స్ వినియోగించాడంటూ అధికారులు అతడిని అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న షారుఖ్ అండ్ ఫ్యామిలీ తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

Aryan Khan: డ్రగ్స్ కేసు.. ఆర్యన్ ఖాన్‌కు క్లీన్‌చిట్

ఎలాగైనా తన కొడుకును ఈ కేసు నుండి బయటపడేయాలని తీవ్ర ప్రయత్నాలు చేశాడు. దేశంలోని బెస్ట్ లాయర్స్‌ను ఈ కేసు వాదించేందుకు నియమించాడు షారుఖ్. అయితే నెలరోజుల పాటు జ్యూడిషియల్ రిమాండ్‌లో భాగంగా జైలులో ఉన్న ఆర్యన్ ఖాన్‌కు నవంబర్‌లో బెయిల్ లభించింది. ఇక రీసెంట్‌గా ఆర్యన్ ఖాన్‌కు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో షారుఖ్, అతడి కుటుంబం సంతోషంలో తేలిపోయింది. అయితే ఆర్యన్ ఖాన్ జైలులో ఉన్నప్పుడు షారుఖ్ మానసిక పరిస్థితి గురించి తాజాగా ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ సంజయ్ సింగ్ వెల్లడించారు. ఆర్యన్ ఖాన్ కేసు ఇన్వెస్టిగేషన్ కోసం ఏర్పాటు చేసిన సిట్‌కి హెడ్‌గా సంజయ్ సింగ్ ఉన్నారు.

Shah Rukh Khan: తొలగిన కష్టాలు.. మళ్ళీ జోష్‌లో షారుఖ్!

ఆర్యన్ ఖాన్ కస్టడీలో ఉన్నప్పుడు తన కొడుకు ఆరోగ్య, మానసిక పరిస్థితి గురించి పదేపదే అడిగి తెలుసుకున్నాడట షారుఖ్. రాత్రుళ్లు తన కొడుకుతో ఉండేందుకు అనుమతిని కోరారు షారుఖ్. కానీ రూల్స్‌కు విరుద్ధంగా అలాంటివి కుదరదని సంజయ్ సింగ్ చెప్పారట. తన కొడుకును ఎలాంటి ఆధారాలు లేకుండా నిందిస్తున్నారని.. తమ కుటుంబాన్ని సమాజాన్ని పాడుచేసేందుకు వచ్చిన రాక్షసులుగా చిత్రీకరిస్తున్నారంటూ షారుఖ్ కన్నీరు పెట్టుకున్నట్లుగా సంజయ్ సింగ్ తెలిపారు. ఎట్టకేలకు తన కొడుకు నిర్దోశి అని కోర్టు తేల్చడంతో షారుఖ్ అండ్ ఫ్యామిలీ ఊపిరిపీల్చుకున్నారని ఎన్సీబీ అధికారి సంజయ్ సింగ్ తెలిపారు.