Bigg Boss 5 : తల్లిని దీప్తి సునైనా గురించి మరీ మరీ అడిగిన షణ్ను

తల్లిని చూడగానే షణ్ను ఆమెను హగ్ చేసుకొని ఏడ్చేశాడు. అయితే ముందుగా తన ప్రేయసి దీప్తి సునయన ఎలా ఉంది అని అడిగాడు. బాగుంది అని చెప్పింది. దీప్తిని కలిసావా అని........

Bigg Boss 5 : తల్లిని దీప్తి సునైనా గురించి మరీ మరీ అడిగిన షణ్ను

Shannu Deepthi

Bigg Boss 5 :  గత రెండు రోజులుగా బిగ్ బాస్ హౌస్ లో ఎమోషనల్ ఎపిసోడ్ నడుస్తుంది. హౌస్ లోని కంటెస్టెంట్స్ కి సంబంధించిన కుటుంబ సభ్యులు రావడంతో అంతా ఎమోషనల్ అయ్యారు. కొంతమంది కంటెస్టెంట్స్ ఇంటి సభ్యులు మొన్నటి ఎపిసోడ్ లో రాగా, నిన్నటి ఎపిసోడ్ లో కొంతమంది వచ్చారు, చివరగా షణ్ను వాళ్ళ మదర్ వచ్చారు. మదర్ ని చూడటంతో షణ్ను చిన్న పిల్లవాడిలా ఎమోషనల్ అయ్యాడు. తల్లిని చూడగానే షణ్ను ఆమెను హగ్ చేసుకొని ఏడ్చేశాడు.

Genelia : నువ్వు ఒంటరివి కాకుండా చూస్తాను.. కొడుకు గురించి ఎమోషనల్ పోస్ట్ పెట్టిన జెనీలియా

తల్లితో కూర్చొని మాట్లాడాడు షణ్ను. అయితే ముందుగా తన ప్రేయసి దీప్తి సునయన ఎలా ఉంది అని అడిగాడు. బాగుంది అని చెప్పింది. దీప్తిని కలిసావా అని అడిగటంతో షణ్ను వాళ్ళ అమ్మ కలిసాను అని చెప్పింది. అమ్మ రాగానే షణ్ను ఎక్కువగా దీప్తి గురించే అడగడం విశేషం. ఆ తర్వాత సిరి వాళ్ల అమ్మ హగ్స్ ఇవ్వడం నచ్చలేదు అన్న మాటలని తీసుకోలేకపోతున్నాను అని వాళ్ళ అమ్మ దగ్గర బాధపడ్డాడు.

Chiranjeevi : చిరంజీవి ట్వీట్‌పై పేర్ని నాని.. బిజీగా ఉన్నాం.. తర్వాత చూద్దాం

అయితే షణ్ను మదర్‌.. అవేమి పట్టించుకోకు, దేని గురించి ఎక్కువ ఆలోచించకు, మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అది నాకు తెలుసు అని కొడుక్కు సపోర్ట్‌ చేసింది. ఎక్కువ ఎమోషనల్‌ అయి గేమ్‌ పాడు చేసుకోకు అని హెచ్చరించింది. అందరితో కలిసి ఉండమని, గొడవలు పెట్టుకోకు, ఎమోషనల్ అవ్వకు అని షణ్నుకు చెప్పి వెళ్ళిపోయింది. దీంతో కంటెస్టెంట్ల ఫ్యామిలీ ఎపిసోడ్స్ ముగిసినట్లే.