Shanmukh Jaswanth : కొత్త ఇల్లు కొన్న షణ్ముఖ్ జస్వంత్

ఇక ఇటీవల దీప్తి సునైనతో బ్రేకప్ జరిగిన సంగతి తెలిసిందే. బ్రేకప్ తర్వాత కెరీర్ మీద మరింత ఫోకస్ పెట్టాలని చూస్తున్నాడు షన్ను. ఇప్పటికే ఓ కొత్త వెబ్ సిరీస్ ని అనౌన్స్ చేశాడు..........

Shanmukh Jaswanth :  కొత్త ఇల్లు కొన్న షణ్ముఖ్ జస్వంత్

Shannu

Shanmukh Jaswanth :   సోషల్ మీడియా స్టార్, యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ బిగ్‌బాస్‌కి వెళ్లకముందే చాలా మందికి తెలిసిన స్టార్. ఎక్కువ సబ్‌స్క్రయిబర్స్ సాధించిన మొదటి తెలుగు యూట్యూబర్ గా రికార్డు కూడా సృష్టించాడు. తన షార్ట్ ఫిలిమ్స్‌తో అందర్నీ మెప్పించిన షన్ను తన వెబ్ సిరీస్‌లతో స్టార్ అయ్యాడు. యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్ సొంతం చేసుకున్నాయి తన వెబ్ సిరీస్‌లు.

ఇక బిగ్‌బాస్‌లో సైలెంట్‌గా ఉంటూ, అప్పుడప్పుడు ఫైర్ అవుతూ, సిరితో రొమాన్స్ చేస్తూ రన్నరప్‌గా మిగిలాడు. బిగ్‌బాస్ తర్వాత బయటకి వచ్చిన కంటెస్టెంట్స్ అంతా బైక్స్, కార్స్, ఇల్లు కొనుక్కుంటున్నారు. తాజాగా షణ్ముఖ్ కూడా ఇదే పంథాలో ఓ కొత్త ఇల్లు కొనుక్కున్నాడు. అయితే ఇది ఫ్యామిలీతో ఉండటానికి కాదని సమాచారం. షన్ను వర్క్స్ చూసుకోవడానికి, షన్ను ఒక్కడే ఉండటానికి, ఫ్రెండ్స్ తో గడపటానికి అని తెలుస్తుంది.

Liger : భారీ ధరకు అమ్ముడైన ‘లైగర్’ డిజిటల్ రైట్స్

ఇక ఇటీవల దీప్తి సునైనతో బ్రేకప్ జరిగిన సంగతి తెలిసిందే. బ్రేకప్ తర్వాత కెరీర్ మీద మరింత ఫోకస్ పెట్టాలని చూస్తున్నాడు షన్ను. ఇప్పటికే ఓ కొత్త వెబ్ సిరీస్ ని అనౌన్స్ చేశాడు. హీరోగా లాంచ్ అవ్వడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. ఈ క్రమంలోనే కొత్త ఇల్లు కొన్న షణ్ముఖ్ ఇటీవల తన ఫ్రెండ్స్ తో కలిసి గృహ ప్రవేశం చేశాడు. దానికి సంబంధించిన ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

View this post on Instagram

A post shared by @software_devlovepers_official