Shannu Deepu : షన్ను-దీపు పెళ్ళికి మాకు ఓకే.. కానీ ఒక్క కండిషన్ : షణ్ముఖ్ పేరెంట్స్

షణ్ముఖ్ తల్లిదండ్రులు వారి ప్రేమ పెళ్లి విషయాలపై మాట్లాడుతూ.. వారి ప్రేమ గురించి మాకు తెలీదు, టీవీలో చూసిన తరవాతే తెలిసింది. దీప్తిని ప్రేమిస్తున్నట్లు షణ్ముఖ్‌ మాతో చెప్పలేదు....

Shannu Deepu : షన్ను-దీపు పెళ్ళికి మాకు ఓకే.. కానీ ఒక్క కండిషన్ : షణ్ముఖ్ పేరెంట్స్

Shannu Depu

Shannu Deepu :  షణ్ముఖ్ దీప్తి సునయన ప్రేమ గురించి అందరికి తెలుసు. టిక్ టాక్ లతో పరిచయమైన వీరు తర్వాత షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్, వీడియోలు చేస్తూ మరింత దగ్గరయ్యారు. వారి పరిచయం తర్వాత ప్రేమగా మారింది. వీళ్ళ పరిచయం దాదాపు ఆరు సంవత్సరాలకు పైనే. వీరి ప్రేమ గురించి బహిరంగంగానే చెప్తూ ఉంటారు ఈ ఇద్దరు.

Bigg Boss : మోసం చేసిన బాయ్‌ఫ్రెండ్.. పోలీసులను ఆశ్రయించిన బిగ్‌బాస్ బ్యూటీ

షన్ను దీప్తి కలిసి హాలిడే ట్రిప్స్ కి వెళ్లడం, ఒకరి కోసం ఒకరు టాటూలు వేయించుకోవడం, ఒకరికొకరు సాయం చేసుకోవడం, వీళ్ళు ఎంజాయ్ చేసే పిక్స్ అన్ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ఈ జంటకి కూడా అభిమానులు ఎక్కువే ఉన్నారు. బిగ్ బాస్ సీజన్ 2లో దీప్తి షన్ను గురించి చెప్పడం, ఈ సీజన్ లో షన్ను దీప్తి గురించి చెప్పడం వీరి ప్రేమని మరింత బహిర్గతం చేశాయి. షణ్ముఖ్‌ అయితే బిగ్‌బాస్‌ హౌస్‌లో దీప్తిని రోజూ తలుచుకుంటాడు. హౌస్‌లోకి వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు కూడా ముందు దీప్తి గురించే అడిగాడు.

Sudigali Sudheer : జబర్దస్త్‌ని వదిలేస్తున్న సుధీర్ టీం.. కన్నీళ్లు పెట్టుకున్న రోజా.. షాక్ లో అభిమానులు..

వీరిద్దరు తమ ప్రేమను బహిర్గతం చేయడంతో వీళ్ళ పెళ్లి గురించి కూడా చర్చలు నడుస్తున్నాయి. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో షణ్ముఖ్‌ తల్లిదండ్రులు షణ్ముఖ్-దీప్తి పెళ్లి విషయంపై మాట్లాడారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. షణ్ముఖ్ తల్లిదండ్రులు వారి ప్రేమ పెళ్లి విషయాలపై మాట్లాడుతూ.. వారి ప్రేమ గురించి మాకు తెలీదు, టీవీలో చూసిన తరవాతే తెలిసింది. దీప్తిని ప్రేమిస్తున్నట్లు షణ్ముఖ్‌ మాతో చెప్పలేదు. వాళ్లు యూట్యూబ్ వీడియోలతో పాపులర్ అయ్యారు. మంచి ఫ్రెండ్స్ అనే అనుకున్నాం. కానీ టీవీ షోలకు వెళ్లడం, టాటూలు వేయించుకోవడం ఇవన్నీ చూసి లవ్‌లో ఉన్నారని తెలిసింది. మేం కూడా మీలాగే టీవీలో చూసే తెలుసుకున్నాం.

Sara Tendulkar : హీరోయిన్స్‌కి ఏ మాత్రం తీసిపోని సచిన్ కూతురు
ఆ తరువాత షణ్ముఖ్ మాకు దీప్తి గురించి ఫ్రెండ్స్ అనే చెప్పాడు. షణ్ముఖ్‌కి ఇష్టం అయితే మాకు ఇష్టమే. కానీ దీప్తి సునయన పేరెంట్స్‌కి ఓకే అయితేనే పెళ్ళికి ఓకే అంటాము. వాళ్లకి ఇష్టం లేకుండా పెళ్లి చేయం. వాళ్ల పేరెంట్స్ కి తెలుసో లేదో తెలీదు. మా అబ్బాయి ఇష్టాన్ని మేం కాదనం. అయినా వాడి పెళ్లికి ఇంకా చాలా టైం ఉంది. ముందు షణ్ముఖ్ అన్నయ్యకి పెళ్లి అవ్వాలి ఆ తర్వాతే వాడి పెళ్లి అని షణ్ముఖ్‌ తల్లిదండ్రులు తెలిపారు.