Porn Case : అలాంటి వీడియోలు చేయిస్తాడని అనుకోలేదు..రాజ్ కుంద్రాపై షెర్లిన్ సంచలన ఆరోపణలు

అశ్లీల చిత్రాల కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాపై నటి షెర్లిన్ చోప్రా తీవ్ర ఆరోపణలు గుప్పించినట్లు తెలుస్తోంది. ఈ కేసును దర్యాప్తు చేపడుతున్న ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు..షెర్లిన్ ను విచారించినట్లు సమాచారం. వారి ఎదుట ఈ నటి కన్నీటిపర్యంతమైందని వార్తలు వస్తున్నాయి.

Porn Case : అలాంటి వీడియోలు చేయిస్తాడని అనుకోలేదు..రాజ్ కుంద్రాపై షెర్లిన్ సంచలన ఆరోపణలు

Chopra

Sherlyn Chopra : అశ్లీల చిత్రాల కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాపై నటి షెర్లిన్ చోప్రా తీవ్ర ఆరోపణలు గుప్పించినట్లు తెలుస్తోంది. ఈ కేసును దర్యాప్తు చేపడుతున్న ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు..షెర్లిన్ ను విచారించినట్లు సమాచారం. వారి ఎదుట ఈ నటి కన్నీటిపర్యంతమైందని వార్తలు వస్తున్నాయి. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆరోపణలు చేసినట్లు సమాచారం. తనతో తప్పుడు పనులు చేయిస్తాడని అనుకోలేదని, ఆర్మ్ ఫ్రైమ్ తో ఒప్పందం కుదిరాక..మొదట గ్లామర్ వీడియోలు చేయించారని..ఆ తర్వాత బోల్డ్ చిత్రాలుగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Sherlyn Rajkundra

Sherlyn Rajkundra

అర్థనగ్నంగా, పూర్తి నగ్నంగా..వీడియోలు చేయించారని, ఇది కూడా గ్లామర్ వీడియోల్లో భాగమేనని తనతో చెప్పారని వెల్లడించారు. ఇలా చేయడం తప్పేమి కాదని..తనతో తీసిన వీడియోలు..శిల్పాశెట్టికి బాగా నచ్చాయని అన్నారని తెలిపారు. ఈ మాటలు నమ్మి మోసపోయానని, శిల్పాశెట్టి లాంటి వారు మెచ్చుకుంటే..తాము తప్పు చేస్తున్నామో..కరెక్టు చేస్తున్నామో అర్థం చేసుకొనే స్థితిలో ఉండమని పేర్కొన్నారని తెలుస్తోంది.

Sherlyn

Sherlyn

శిల్పాశెట్టికి గాని..రాజ్ కుంద్రాలకు తాను వ్యతిరేకం కాదని..పోర్నోగ్రఫీ రాకెట్ కు మాత్రం తాను వ్యతిరేకనని చెప్పారు. బోల్డ్ సినిమాల్లో నటించేముందు..వారికి స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. వీరు చేస్తున్నవి గ్లామర్ వీడియోలు కావు..ప్రోర్న్ వీడియోలని తాను చాలా ఆలస్యంగా తెలుసుకున్నట్లు షెర్లిన్ వెల్లడించారు. పోలీసుల ఎదుట ఇలా హాజరు కావాల్సి ఉంటుందని తాను అస్సలు ఊహించలేదని, రాజ్ కుంద్రాను తొలిసారి కలిసినప్పుడు జీవితమే మారిపోతుందని ఊహించినట్లు తెలిపారు. భవిష్యత్ లో తన పిల్లలను ఈ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనివ్వనని ఖరాఖండిగా చెప్పేశారు షెర్లిన్.