VD 12 : శివ సినిమా సాలిడ్‌గా ఉంటుందంట..

ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌ని ఫుల్ స్వింగ్‌లో అవ్వగొడుతున్న శివ అండ్ టీమ్.. విజయ్ దేవరకొండ ‘లైగర్’ ఫినిష్ చెయ్యగానే షూట్ స్టార్ట్ చెయ్యడానికి షెడ్యూల్స్ రెడీ చేసుకుంటున్నారు..

VD 12 : శివ సినిమా సాలిడ్‌గా ఉంటుందంట..

Vd 12

VD 12: హీరోలు ఒకేసారి ప్యార్లర్‌గా 2, 3 సినిమాలు చేస్తుంటే రౌడీ హీరో మాత్రం నెక్ట్స్ సినిమా ఎవరితోనో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు . ‘లైగర్’ అవ్వకుండానే సుకుమార్‌తో సినిమా అనౌన్స్ చేసిన విజయ్ దేవరకొండ ఆ సినిమా ఊసే ఎత్తడం లేదు. అయితే లేటెస్ట్‌గా నా నెక్ట్స్ సినిమా విజయ్‌తోనే, ‘లైగర్’ అవ్వగానే సినిమా మొదలుపెడుతున్నాం అంటూ మరో డైరెక్టర్ కన్ఫామ్ చేశారు. ఇంతకీ విజయ్ నెక్ట్స్ సినిమా ఎవరితో..?

Sukumar – Vijay Deverakonda : విజయ్ దేవరకొండ – సుకుమార్ ప్రాజెక్ట్‌లో ఎలాంటి మార్పు లేదు.. పుకార్లు నమ్మకండి..

‘లైగర్’ సినిమా లాస్ట్ స్టేజ్‌కి వచ్చేసింది. ఈ సినిమా తర్వాత సెట్స్ మీదకెళ్లబోయేది ఏ మూవీకి ఇప్పటి వరకూ క్లారిటీ ఇవ్వలేదు రౌడీ హీరో. అంతకుముందే ఫాల్కన్ ప్రొడక్షన్స్‌లో సుకుమార్‌తో మూవీ అనౌన్స్ చేసినా.. ‘పుష్ప’ షూట్‌లో బిజీగా ఉన్న సుక్కు విజయ్‌తో సినిమాని ఇంత ఎర్లీగా స్టార్ట్ చేసే ఛాన్స్ లేదు. అందుకే విజయ్ ఫైనల్ కాల్ కోసం వెయిట్ చేస్తున్న శివ నిర్వాణ విజయ్ సినిమా మొదలు పెట్టేశారు.

Ram Charan : రామ్ చరణ్ వాచ్ అదిరింది.. కాస్ట్ ఎంతో తెలుసా..!

నిజానికి విజయ్.. ‘లైగర్’ సినిమా కంప్లీట్ చెయ్య కుండానే సుకుమార్‌తో మూవీ అనౌన్స్ చేశారు. అంతేకాదు.. ఫాల్కన్ ప్రొడక్షన్స్‌లో సినిమా తెరకెక్కబోతోందంటూ మళ్లీ క్లారిటీ కూడా ఇచ్చారు మేకర్స్. కానీ ఇప్పటి వరకూ సుకుమార్ సినిమా ఎప్పుడు, ఏంటి అన్నది మాత్రం సస్పెన్స్‌లోనే ఉంచారు. దాంతో విజయ్‌తో సినిమా చేద్దామనుకున్న శివ నిర్వాణ తన సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ని స్టార్ట్ చేశారు.

Ashu Reddy : ఆర్జీవీతో బోల్డ్ ఇంటర్వూ.. అషు రెడ్డి వాళ్ల అమ్మ ఏం చెప్పిందంటే..

‘టక్ జగదీష్’ రిలీజ్‌లో బిజీగా ఉన్న శివ నిర్వాణ.. ఈ 10 వ తేదీన సినిమా రిలీజ్ కాగానే ఫుల్‌గా ఫ్రీ అయిపోతారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌ని ఫుల్ స్వింగ్‌లో అవ్వగొడుతున్న శివ అండ్ టీమ్.. విజయ్ దేవరకొండ ‘లైగర్’ ఫినిష్ చెయ్యగానే సినిమా స్టార్ట్ చెయ్యడానికి ఇప్పటి నుంచే షెడ్యూల్స్ రెడీ చేసుకుంటున్నారు. సో.. విజయ్ ప్రస్తుతానికి సుకుమార్‌ని పక్కన పెట్టి శివ నిర్వాణతోనే సై అంటున్నారు.