Siddharth – Aditi : సిద్దార్థ్‌తో కలిసి ప్రీమియర్ షోకి వచ్చిన అదితి.. ఇప్పటికైనా నమ్ముతారా?

అదితి నటించిన జూబిలీ సిరీస్ నేటి నుంచి అమెజాన్ లో స్ట్రీమ్ అవ్వనుంది. ఈ నేపథ్యంలో గురువారం నాడు ముంబైలో జూబిలీ సిరీస్ ప్రీమియర్ వేయగా అదితి సిద్దార్థ్ తో కలిసి వచ్చింది.

Siddharth – Aditi : సిద్దార్థ్‌తో కలిసి ప్రీమియర్ షోకి వచ్చిన అదితి.. ఇప్పటికైనా నమ్ముతారా?

Siddharth and Aditi Rao Hydari (Photo : Instagram)

Siddharth – Aditi :  హీరో సిద్దార్థ్(Siddharth), హీరోయిన్ అదితిరావు హైదరి(Aditi Rao Hydari) గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు, డేటింగ్ లో ఉన్నారు అని వార్తలు వస్తూనే ఉన్నాయి. ముంబై(Mumbai) వీధుల్లో ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరిగేస్తున్నారు, కలిసి డిన్నర్స్, లంచ్, పార్టీలకు వెళ్తూనే ఉన్నారు. ఇటీవల శర్వానంద్(Sharwanand) నిశ్చితార్థానికి కూడా కలిసే వచ్చారు ఈ జంట. ఈ మధ్య ఓ ట్రెండింగ్ సాంగ్ కి రీల్ కూడా చేశారు. దీంతో వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారా అని ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు.

మహా సముద్రం(Maha Samudram0 సినిమాలో అదితి, సిద్దార్థ్ కలిసి నటించారు. అంతకుముందు నుంచే వీరికి పరిచయం ఉన్నా ఈ సినిమా తర్వాత క్లోజ్ గా మారారు. ఎక్కడికి వెళ్లినా ఇద్దరు కలిసి వెళ్లడంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని అంతా భావిస్తున్నారు. అదితి నటించిన జూబిలీ సిరీస్ నేటి నుంచి అమెజాన్(Amazon) లో స్ట్రీమ్ అవ్వనుంది. ఈ నేపథ్యంలో గురువారం నాడు ముంబైలో జూబిలీ(Jubilee) సిరీస్ ప్రీమియర్ వేయగా అదితి సిద్దార్థ్ తో కలిసి వచ్చింది.

Ravanasura : రావణాసుర ప్రీ రిలీజ్ బిజినెస్.. ధమాకా కంటే తక్కువే.. మాస్ మహారాజ హ్యాట్రిక్ కొడతాడా?

సిద్దార్థ్ వైట్ షర్ట్ లో, అదితి ఫుల్ బ్లాక్ లాంగ్ ఫ్రాక్ లో కలిసి వచ్చి సందడి చేశారు. మీడియాకు ఇద్దరూ కలిసి ఫోటోలు కూడా ఇచ్చారు. ఇప్పటివరకు ఇద్దరూ కలిసి ప్రైవేట్ గా పార్టీలకు, డిన్నర్స్ కి వెళ్తే మీడియాకి చిక్కడంతో అందరూ వీరు డేట్ లో ఉన్నారు అనుకున్నారు. ఈ సిరీస్ కి సిద్దార్థ్ కి సంబంధం లేకపోయినా అదితి కోసం వచ్చాడు. ఈ సారి ఇలా ఇద్దరూ కలిసి వచ్చి మీడియాకి ఫోజులు ఇవ్వడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. దీంతో సిద్దార్థ్, అదితి నిజంగానే ప్రేమలో ఉన్నారని చాలా మంది ఫిక్స్ అయిపోతున్నారు. మొత్తానికి మరోసారి ఈ జంట వార్తల్లో నిలిచింది.

View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)