Bigg Boss 5 : మన రిలేషన్‌షిప్ బిగ్‌బాస్ వరకే.. షణ్నుకి గుర్తుచేసిన సిరి

కొంతమంది మాజీ కంటెస్టెంట్స్ పొగడ్తలతో పాటు షణ్ను, సిరిల ఫ్రెండ్‌షిప్‌పై సెటైర్లు వేస్తూ వారిని ఓ ఆటాడుకున్నారు. సిరి మాత్రం ఏ రిలేషన్ షిప్ అయినా, మన రిలేషన్ షిప్‌ అయినా.....

Bigg Boss 5 : మన రిలేషన్‌షిప్ బిగ్‌బాస్ వరకే.. షణ్నుకి గుర్తుచేసిన సిరి

Shannu Siri

Bigg Boss 5 :  ఇవాళ్టితో బిగ్ బాస్ అయిపోనుంది. ప్రేక్షకులు, కంటెస్టెంట్స్ అభిమానులు విన్నర్ ఎవరు అవుతారా అని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సిరి, మానస్ కూడా ఎలిమినేట్ అయిపోవడంతో టాప్ 3లో షణ్ను, సన్నీ, శ్రీరామ్ ఉన్నారు. ఇపుడు వీళ్ళ ముగ్గురిలో విన్నర్ ఎవరు అవుతారో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ వచ్చి ఇప్పటి ఫైనల్ కంటెస్టెంట్స్ తో ముచ్చటించారు. హరితేజ, గీతా మాధురి, రోల్ రైడా, శివబాలాజీ, శివజ్యోతి, రాహుల్ సిప్లిగంజ్, అరియనా గ్లోరీ, అఖిల్‌ సార్థక్‌లు నిన్న బిగ్ బాస్ లో సందడి చేశారు. వీరంతా బిగ్ బాస్ లో నిన్న మంచి ఎంటర్టైన్మెంట్ అందించారు. ఇక కొంతమంది మాజీ కంటెస్టెంట్స్ పొగడ్తలతో పాటు షణ్ను, సిరిల ఫ్రెండ్‌షిప్‌పై సెటైర్లు వేస్తూ వారిని ఓ ఆటాడుకున్నారు.

Aarya 3 : విజయదేవరకొండ సినిమా తర్వాత ‘ఆర్య 3’ ఉండొచ్చేమో

దీంతో సన్నీ, మానస్‌, శ్రీరామ్‌ పడీపడీ నవ్వారు. అయితే షణ్నుని ఎవరన్నా ఏమన్నా అంటే ఫీల్ అయిపోతాడు. నిన్న కూడా మాజీ కంటెస్టెంట్స్ అంతా షణ్ను సిరిని ఏడిపించడంతో పాటి సన్నీ నవ్వడంతో బాగా సీరియస్ అయి ఫీల్ అయిపోయాడు. దీంతో మనిద్దరం హైలైట్‌ అవుతున్నామని వాళ్లకి మండిపోతున్నట్టు ఉంది అని సిరితో చెప్పాడు. అయితే సిరి మాత్రం ఏ రిలేషన్ షిప్ అయినా, మన రిలేషన్ షిప్‌ అయినా బిగ్‌బాస్‌ హౌస్‌ వరకే అని గతంలో షణ్ను అన్న మాటను గుర్తు చేసింది. దీంతో మళ్ళీ ఇద్దరూ బాధపడటంతో సిరిని ఓదార్చుతూ హగ్‌ చేసుకున్నాడు షణ్ను. సైలెంట్ గా ఉండకుండా ఇది చూసిన సన్నీ మళ్ళీ షణ్నుని రెచ్చకొట్టాడు. బయటకు వెళ్లాక షణ్ను హగ్‌ గురూ అయిపోతాడని కామెంట్‌ చేశాడు. కానీ షణ్ను మాత్రం సైలెంట్ అయిపోయాడు.