Bigg Boss 5 : ఎవడిక్కావాల్రా నీ సారీ.. ఒకరిపై ఒకరు ఫైర్ అయిన షన్ను సిరి

షన్ను మీద ఉన్న చనువుతో మనిద్దరం కలిసి ఓ సాంగ్‌ చేద్దాంరా అని సిరి ప్రేమగా అడిగింది. దీంతో షన్ను సీరియస్ అయి హమీదా కూడా ఇంతే వర్క్‌ అనేసరికి నేను గుర్తొస్తాను. బయటకు వెళ్లి వీడియోలు

Bigg Boss 5 : ఎవడిక్కావాల్రా నీ సారీ.. ఒకరిపై ఒకరు ఫైర్ అయిన షన్ను సిరి

Shannu Siri

Bigg Boss 5 :  బిగ్ బాస్ లో గొడవలు, అలకలు, ఏడవడాలు, లవ్ ట్రాక్స్ సాధారణం. ఈ సీజన్ లో గొడవలే ఎక్కువగా అవుతున్నాయి. గత సీజన్స్ తో పోలిస్తే ఈ సీజన్లో లవ్ ట్రాక్స్ తక్కువే ఒక్క మానస్, ప్రియాంక తప్ప అందరు ఫ్రెండ్స్ అనే మాట్లాడుకుంటున్నారు. ఫ్రెండ్స్ అనే హగ్స్ ఇచ్చుకుంటున్నారు. ఫ్రెండ్స్ అనే తినిపించుకోవడం, కలిసి ఆడటం చేస్తున్నారు. ఫ్రెండ్స్ గా ఉన్న వాళ్ళు గేమ్ లో మోసం చేసారని తెలిస్తే వాళ్ళని కొంచెం దూరం పెడుతున్నారు. లేదా సీరియస్ అవుతున్నారు. కొంతమంది అలుగుతున్నారు కూడా. ఈ సారి కంటెస్టెంట్స్ లో ముఖ్యంగా షన్ను, సిరి, జెస్సిలు కలిసి ఉంటూ కలిసి ఆడుతున్నారు. షన్ను సిరులు బిగ్ బాస్ కి రాకముందు నుంచి మంచి ఫ్రెండ్స్. వీళ్లిద్దరు కలిసి యూట్యూబ్ వీడియోలు కూడా చేశారు. బిగ్ బాస్ లో కూడా వాళ్ళ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు.

Bigg Boss 5 : నా వల్ల కాదు.. నేను బిగ్ బాస్ నుంచి వెళ్ళిపోతా

అయితే ఇటీవల జెస్సికి సీక్రెట్ టాస్క్ ఇచ్చినప్పుడు షన్నుకి చెప్పకుండా జెస్సి, సిరిలు కలిసి ఆడారు. దీంతో షన్ను బాగా హర్ట్ అయి ఇద్దరి మీద సీరియస్ అయ్యాడు. ఒక రోజు మాట్లాడలేదు కూడా. వాళ్ళకి దూరంగా వెళ్ళిపోయి ఏడ్చాడు. సిరి బతిమాలినా కూడా వెంటనే కరగలేదు. మొన్న నామినేషన్స్ లో కూడా సిరి లెటర్ ని షన్ను చింపేసాడు. మళ్ళీ మరోసారి వీళ్ళ మధ్య గొడవ వచ్చింది.

Samantha : థంబ్‌నైల్స్‌తో మాకు సంబంధం లేదు.. సమంత కేసులో స్పందించిన డాక్టర్ సీఎల్ వెంకట్‌రావు

షన్ను మీద ఉన్న చనువుతో మనిద్దరం కలిసి ఓ సాంగ్‌ చేద్దాంరా అని సిరి ప్రేమగా అడిగింది. దీంతో షన్ను సీరియస్ అయి హమీదా కూడా ఇంతే వర్క్‌ అనేసరికి నేను గుర్తొస్తాను. బయటకు వెళ్లి వీడియోలు చేద్దాం అనేసరికి నేను గుర్తొస్తాను అని సిరిపై కోపం చూపించాడు. దీంతో హర్ట్‌ అయిన సిరి నీతో సాంగ్‌ చేయడానికే నేనిదంతా చేస్తున్నానా? అని షన్నుపై సీరియస్ అయింది. అంతే కాక అలిగింది. సిరి అలిగింది తెలుసుకొని ఈ సారి షన్ను వెళ్లి సారీ చెప్పాడు. కానీ ఫుల్ కోపంలో ఉన్న సిరి ఎవడిక్కావాల్రా నీ సారీ, ఇష్టమొచ్చినట్లు మాట్లాడేసి ఇప్పుడు సారీ చెప్తున్నావా? నాకు ఒళ్లు మండిపోతుంది అని షన్నుపై ఫైర్‌ అయింది. ఇలా ఇద్దరూ కాసేపు గొడవ పడి ఎప్పటిలాగే మళ్ళీ ఇద్దరూ తిరిగి కలిసిపోయారు.