Siva Rajkumar: ఆత్మహత్య చేసుకోవద్దు.. ప్లీజ్.. ఫ్యాన్స్‌‍కు శివన్న రిక్వెస్ట్!

నటుడు పునీత్ రాజ్‌కుమార్ అకాల మరణంతో నటుడు శివరాజ్‌కుమార్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Siva Rajkumar: ఆత్మహత్య చేసుకోవద్దు.. ప్లీజ్.. ఫ్యాన్స్‌‍కు శివన్న రిక్వెస్ట్!

Shivanna

Siva Rajkumar: నటుడు పునీత్ రాజ్‌కుమార్ అకాల మరణంతో నటుడు శివరాజ్‌కుమార్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ సమయంలో అభిమానులు ఎంతోమంది తీవ్ర నిరాశలో ఉండిపోగా.. కొంతమంది ఆత్మహత్య కూడా చేసుకునేందుకు సిద్ధం అవుతున్నారు. కొందరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయంపై కర్నాటకలో శివన్నగా పిలుచుకునే పునీత్ అన్నయ్య శివరాజ్‌కుమార్ స్పందించారు.

పునీత్ చనిపోవడంతో ‘నా కొడుకును పోగొట్టుకున్నాను’.. నేను ఈ విషయంలో చాలా బాధపడుతున్నాను. అభిమానులు కఠినమైన నిర్ణయాలను తీసుకుని మరింత బాధపెట్టొద్దు.. ఆత్మహత్య నిర్ణయం తీసుకోవద్దు.. అంటూ అభిమానులకు విజ్ఞప్తి చేశారు పునీత్. సదాశివనగర్‌లోని పునీత్ నివాసం దగ్గర శివరాజ్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘పునీత్ మన మధ్య లేడనే విషయం చెప్పడం కష్టమే. భరించలేని బాధ కూడా ఉంటుంది. పునీత్ చాలా చిన్నవాడు. చిన్న వయసులోనే భగవంతుని వద్దకు వెళ్లిపోయాడు.

Kichcha Sudeep: రాత్రిళ్లు నువ్వు నాకు కచ్చితంగా కనిపిస్తావు.. వీడ్కోలు మిత్రమా!

పునీత్‌ని తీసుకుని వెళ్లినందుకు దేవుడు సంతోషపడొచ్చు కానీ, మనకు మిగిల్చిన బాధ మాత్రం చాలా ఎక్కువే. అభిమానులు బాధను తట్టుకోవడం చాలా కష్టమే. నేను పునీత్ కంటే 13ఏళ్లు పెద్దవాడిని. పునీత్‌ని చిన్నప్పటి నుంచి చూశాను. నా బిడ్డను పోగొట్టుకున్న ఫీలింగ్ నాకు ఇప్పుడు ఉంది. కానీ, జీవితం ముందుకు సాగాలి కదా? మేమంతా అప్పు కుటుంబానికి అండగా ఉన్నాము. మేము అప్పు చేయాలి అనుకున్నవాటిని నెరవేర్చడానికి ప్రయత్నిస్తాము. అంటూ చెప్పుకొచ్చారు.

Puneeth Rajkumar: పునీత్‌ పార్థివ దేహానికి ముద్దు పెట్టిన ముఖ్యమంత్రి.. కుటుంబానికి అండగా.. అన్నీ తానై..!!

ఇదే సమయంలో “ప్రభుత్వం, పోలీసు సిబ్బంది అప్పు అంత్యక్రియల విషయంలో చాలా బాగా సహకరించారు. ముఖ్యమంత్రి బొమ్మైకి ధన్యవాదాలు. ప్రభుత్వం మా కుటుంబంపై గౌరవంతో చక్కని ఏర్పాట్లు చేసింది. ‘నాలో, రఘులో.. అంతకు మించి అభిమానుల గుండెల్లో అప్పు ఎప్పటికీ ఉంటాడు. దయచేసి ఆత్మహత్యల్లాంటి నిర్ణయాన్ని అభిమానులు తీసుకోకండి. మీకు మా కుటుంబం ఉంది. దయచేసి మీ కుటుంబాలను జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే మీ అవసరం కుటుంబానికి ఉంటుంది.” అంటూ చెప్పుకొచ్చారు.