RGV: సౌత్ VS నార్త్ మూవీ వార్.. హిందీ వాళ్ళకి జెలసీ అంటున్న వర్మ! South VS North Movie War .. RGV Said Hindi people jealousy on South Movies

RGV: సౌత్ VS నార్త్ మూవీ వార్.. హిందీ వాళ్ళకి జెలసీ అంటున్న వర్మ!

సౌత్ నుండి నార్త్ లో రిలీజ్ అవుతున్న పాన్ ఇండియా సినిమాలు బాలీవుడ్ లో ఘన విజయాలు సాధిస్తున్న సంగతి తెలిసిందే. పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ సినిమాలు బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అయి బాలీవుడ్ సినిమాల ఊహకు అందని కలెక్షన్లను కొల్లగొడుతున్నాయి.

RGV: సౌత్ VS నార్త్ మూవీ వార్.. హిందీ వాళ్ళకి జెలసీ అంటున్న వర్మ!

RGV: సౌత్ నుండి నార్త్ లో రిలీజ్ అవుతున్న పాన్ ఇండియా సినిమాలు బాలీవుడ్ లో ఘన విజయాలు సాధిస్తున్న సంగతి తెలిసిందే. పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ సినిమాలు బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అయి బాలీవుడ్ సినిమాల ఊహకు అందని కలెక్షన్లను కొల్లగొడుతున్నాయి. ఈ క్రమంలోనే సౌత్ స్టార్స్.. బాలీవుడ్ సెలబ్రిటీల మధ్య ఓ కోల్డ్ వార్ కూడా జరుగుతుంది. ఇప్పటికే ఎందరో సినీ ప్రముఖులు ఈ అంశంపై ఎవరికి తోచినట్లు వాళ్ళు కామెంట్స్ చేస్తుండగా.. అజయ్ దేవగన్, కిచ్చా సుదీప్‌ల మధ్య ట్విట్టర్ వార్ దీనిని మరింత పెంచేసింది.

RGV : హిందీ సినిమాలకి వైరస్ పట్టింది

ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో కిచ్చా సుదీప్ మాట్లాడుతూ.. ‘హిందీ జాతీయ భాష కాదు. కేజీఎఫ్ చాప్టర్ 2, పుష్ప: ది రైజ్, ఆర్ఆర్ఆర్.. ఇతర చిత్రాల పాన్-ఇండియా విజయాలపై స్పందిస్తూ, ‘మేము దక్షిణ భారతదేశం నుండి వచ్చినందున, వారు మమ్మల్ని ‘పాన్-ఇండియా’ అని పిలవడం ప్రారంభించారు. హిందీ సినిమాగా చెప్పలేకపోతూ పాన్-ఇండియాగా చెప్పాలా?’ అని కిచ్చా సుదీప్ ప్రశ్నించారు. అంతేకాదు హిందీ ఇక నుంచి ఏమాత్రం జాతీయ భాష కాదు. నేడు బాలీవుడ్‌ ఎన్నో పాన్‌ ఇండియా సినిమాలను నిర్మిస్తోంది. తెలుగు, తమిళంలో డబ్ చేసేందుకు ఎంతో కష్టపడుతున్నారు. కానీ అవి అంతగా విజయం సాధించలేకపోతున్నాయి. కానీ ఈరోజు మనం తీస్తున్న సినిమాలను ప్రపంచం మొత్తం చూస్తున్నాయి’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

RGV : స్టార్ హీరోల రెమ్యునరేషన్ పై ఆర్జీవీ.. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..

సుదీప్ వ్యాఖ్యలపై బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ మాట్లాడుతూ, ‘మేరే భాయ్ కిచ్చా సుదీప్… మీ అభిప్రాయం ప్రకారం హిందీ జాతీయ భాష కానప్పుడు… మీ మాతృభాష సినిమాలను హిందీలోకి ఎందుకు డబ్ చేస్తున్నారు? హిందీ ఎప్పటికీ మన జాతీయ భాషే. జన గణ మన’ అని ట్వీట్ చేశారు. దీనిపై కొందరు దక్షణాది నుండి సుదీప్ కు సపోర్ట్ చేస్తూ హిందీ జాతీయ బాష కాదంటూ ఒకరకంగా ట్విట్టర్ లో వార్ మొదలు పెట్టారు. కాగా.. అజయ్-సుదీప్ ట్విట్టర్ కోల్డ్ వార్ పై స్పందించిన ఫిలిం మేకర్ రామ్ గోపాల్ వర్మ సౌత్ అంటే తర్వాత నార్త్ స్టార్స్ అసూయపడుతున్నారని సెటైరికల్ కామెంట్స్ వేస్తూ వరస ట్వీట్స్ చేశారు.

RGV : అసలే సౌత్ సక్సెస్‌పై కుళ్ళుకుంటున్న బాలీవుడ్.. ట్వీట్స్‌తో మరింత రెచ్చగొడుతున్న ఆర్జీవీ..

అజయ్‌ దేవగన్‌, కిచ్చా సుదీప్‌ల ట్విట్టర్‌ వార్‌లో సుదీప్ పక్షాన రామ్ గోపాల్ వర్మ బుధవారం అర్థరాత్రి ట్విటర్‌లో ట్వీట్స్ వర్షం కురిపించారు. కన్నడ డబ్బింగ్ చిత్రం కేజేఎఫ్-2.. తొలి రోజే రూ.50 కోట్ల కలెక్షన్లు రాబట్టడంతో ఉత్తరాది తారలు దక్షిణాది తారల పట్ల అసూయతో ఉన్నారనేది కాదనలేని మూల నిజం అంటూ వర్మ ట్వీట్ చేశారు. మనమందరం ఇక రాబోయే హిందీ చిత్రాల ప్రారంభ రోజుల కలెక్షన్లను చూడాలని సెటైర్లు వేస్తూ సుదీప్ ను ట్యాగ్ చేశారు. మరో ట్వీట్‌లో వర్మ భారతదేశం అంటే ఒక్కటేనని పేర్కొన్నాడు. అజయ్ కూడా తప్పుగా అనడం లేదని తాను నమ్ముతున్నానని చెప్తూనే.. మీరు హిందీ జాతీయ బాష కాదని చేసిన ప్రకటన సంతోషంగా ఉందని కిచ్చా సుదీప్‌కి ఆర్జీవీ మరింత మద్దతు తెలిపారు.

×